కత్తి మహేష్ కూడా వేధించాడట


junior artiste comments on kathi mahesh కత్తి మహేష్ లుంగి మీద ఉండి కూడా నన్ను రూంలోకి తీసుకెళ్లి గడియపెట్టి లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది జూనియర్ ఆర్టిస్ట్ సునీత . నిన్న సాయంత్రం ఓ ఛానల్ నిర్వహించిన లైవ్ కార్యక్రమంలో కత్తి మహేష్ తో పాటుగా జూనియర్ ఆర్టిస్ట్ సునీత పాల్గొంది . సినిమారంగంలో వేధింపుల గురించి చర్చ జరుగుతుండగా సునీత కత్తి మహేష్ పై ఆరోపణలు లైవ్ లోనే చేసి సంచలనం సృష్టించింది .

 

కత్తి మహేష్ నన్ను లైంగికంగా వేధించాడని అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని పోలీసులను ఆశ్రయిస్తే కేసు నమోదు చేసుకోలేదని అయినప్పటికీ నా పోరాటం ఆపేది లేదని అంటోంది . అయితే కత్తి మహేష్ ఏమో సునీత చేసే ఆరోపణలు అవాస్తవమని , ఆమెపై యాభై లక్షల పరువు నష్టం దావా వేస్తానని అంటున్నాడు . శ్రీరెడ్డి లీక్స్ తెలుగునాట సంచలనం సృష్టిస్తూ ఇతరులను కూడా ఇబ్బంది పెడుతోంది . మరి కత్తి మహేష్ పై చేసిన ఆరోపణలు ఏమౌతాయో చూడాలి .