మా అన్నయ్య సూపర్ – జూనియర్ ఎన్టీఆర్


మా అన్నయ్య సూపర్ - జూనియర్ ఎన్టీఆర్
మా అన్నయ్య సూపర్ – జూనియర్ ఎన్టీఆర్

నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన ఎంత మంచి వాడవురా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎంత మంచి వాడవురా సినిమా ఘన విజయం సాధించాలని తన సోదరుడు కళ్యాణ్ రామ్ కెరీర్ లో భారీ హిట్ గా నిలవాలని, అందుకు అభిమానులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైవిధ్యభరితమైన కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు గా ఉన్న వేగేశ్న సతీష్ గారు ఈ సినిమాకు దర్శకుడు. శివలింగ కృష్ణ ప్రసాద్ గారు ఈ సినిమా సమర్పకులు ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన జూనియర్ ఎన్టీఆర్ నల్లటి టోపీ పెట్టుకొని ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న R.R.R సినిమాలో కనబడే తన లుక్ రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. ఇప్పటికే ఆయన కొమరం భీం పాత్రకు సంబంధించి షూటింగ్ లో కొన్ని ఫోటోలు బయటకు రాగా, అభిమానులు వాటి ఆధారంగా స్కెచ్ లు రిలీజ్ చేస్తున్నారు. ప్రతి ఆడియో వేడుకలో ను మనసు విప్పి తన భావాలను పంచుకునే జూనియర్ ఎన్టీఆర్ ఎంత మంచి వాడవురా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానులు అత్యుత్సాహం వల్ల కొంత ఇబ్బంది పడ్డారు. తన అన్న ఎప్పటి నుంచి ఒక మంచి కుటుంబ కథా చిత్రం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఈ సినిమాతో ఆయన కోరిక నెరవేరిందని ఈ సినిమాని హిట్ చేయవలసిందిగా అభిమానులకు విజ్ఞప్తి చేశారు జూనియర్ ఎన్టీఆర్. అదేవిధంగా సంక్రాంతికి విడుదలవుతున్న అన్ని సినిమాలు ఘనవిజయం సాధించాలని తెలుగు చిత్రసీమ ఎల్లప్పుడూ విజయాలతో విలసిల్లాలని కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. కొసమెరుపు ఏమిటంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడు రాజీవ్ కనకాల గారు ప్రతినాయకుడి పాత్రలో నటించారు.