టాలీవుడ్ లో మరో జూనియర్ సమంత


టాలీవుడ్ లో మరో జూనియర్ సమంత
టాలీవుడ్ లో మరో జూనియర్ సమంత

“మనిషిని పోలిన మనిషి ప్రపంచంలో ఏడుగురు ఉంటారు…” అని ఎప్పుడో ఎవరో ఏదో అన్నట్లు గుర్తు. అంతేలే బ్రహ్మదేవుడు అయినా కానీ, ఎంతమందినని క్రియేట్ చేస్తాడు.? ఎంత మంది మనుషులను సృష్టించినా ఆయన్ని మాత్రం ఈ జనాలు గుర్తుపెట్టుకోరు. అందరికీ గుళ్ళు కడతారు కానీ, తమని సృష్టించిన బ్రహ్మ దేవుడికి మాత్రం ఒకే ఒక్క గుడి కూడా కట్టారు. అదే ప్రపంచంలో ఉన్న వెరైటీ అంటే.

సరే ఇప్పుడు పాయింట్ లోకి వస్తే టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలకు వాళ్ల పోలికలతోనే ఉండే కొంతమంది జూనియర్స్ సోషల్ మీడియాలో మరియు బయట కనపడుతూ ఉంటారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ గారి తో మొదలుపెట్టి ప్రస్తుతం చిరంజీవి గారు జూనియర్ ఎన్టీఆర్ గారి పోలికలతో ఉండే మనుషులు కూడా బయట తిరుగుతూ ఫేమస్ అయ్యారు. అయితే హీరోయిన్ పోలికలతో ఉండే అమ్మాయిలు ఉండటం అదేవిధంగా ఆ హీరోయిన్ అలాగే ఉండటం చాలా రేర్.

 “ఏ మాయ చేసావే” సినిమాతో టాలీవుడ్ లో నిజంగానే మాయ చేసిన సమంత పోలికలతో ఇప్పటికే ఒక సోషల్ మీడియా సెలబ్రిటీ మనకి తెలుసు. ఆమె పేరు అశు రెడ్డి. తను ఎంత ఫేమస్ అయిందంటే, అంటే బిగ్ బాస్ సీజన్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సినిమాలు కూడా చేసింది. ఇప్పుడు టాలీవుడ్ లో మరొక అమ్మాయి సమంత పోలికలతోనే తన ఫోటో షూట్ లు చేసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి పాపులర్ అవుతోంది. ఆమె పేరు ఆత్మిక. ఇంస్టాగ్రామ్ లో ఇప్పటికే ఆమెకు 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్కసారి ఆమె ప్రొఫైల్ చూసిన వాళ్ళు ఎవరైనా కానీ, “ఈ మేడం… సమంత లాగానే ఉంది” అని  అంటున్నారు. ఇక ఆశు రెడ్డి లాగా ఆత్మిక  కూడా సినిమా ఛాన్స్ లతో ఫేమస్ అవ్వాలని కోరుకుందాం.

 

View this post on Instagram

 

I wonder how… I wonder why!!!

A post shared by aathmika?? (@iamaathmika) on