పార్టీ మారేది లేదంటున్న జూపల్లి


Jupalli Krishnarao
Jupalli Krishnarao

నేను టీఆర్ఎస్ పార్టీ వీడటం లేదని , కావాలనే కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నాడు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు . గత ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయాడు జూపల్లి కృష్ణారావు , దాంతో పార్టీలో అంతగా ప్రాధాన్యత లభించడం లేదని వాపోతున్నాడట . అయితే కొద్దిరోజులుగా జూపల్లి పార్టీ మారుతున్నట్లు ప్రచారం సాగుతుండటంతో స్పందించిన జూపల్లి ఆ వార్తలను ఖండించాడు .

నేను పూటకో పార్టీ మారే రకం కాదని , కానీ నాపై కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని …… కేసీఆర్ , కేటీఆర్ ల నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలోనే పనిచేస్తానని అంటున్నాడు . కొల్హాపూర్ లో ఓడిపోయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అంటున్నాడు జూపల్లి కృష్ణారావు .