జస్టిస్ ఫర్ ఆసిఫా


justice for asifaఎనిమిదేళ్ల చిన్నారి ని అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా కర్కోటంగా హత్య చేసిన సంఘటన భారతదేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది . జమ్మూ కాశ్మీర్ లోని కతువా లో ఈ సంచలన సంఘటన జరిగింది . సంచార జాతి కి చెందిన వాళ్ళని కతువా నుండి పారిపోయేలా చేయడానికి కొంతమంది హిందువులు కలిసి చేసిన దారుణమిది . సంచార జాతిని భయపెట్టడానికి ఆసిఫా అనే చిన్నారి ని కిడ్నాప్ చేసి అత్యంత ఘోరంగా అత్యాచారం చేసారు . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వారం రోజుల పాటు ఆ చిన్నారి కి నరకం చూపించారు .

వారం రోజుల తర్వాత ఆ చిన్నారి ని బండరాయి తో చంపేశారు . అయితే ఈ కేసు వెలుగులోకి రాకుండా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగినప్పటికీ ఓ పోలీస్ అధికారి అత్యంత చాకచక్యంగా సాహసోపేతంగా వ్యవహరించడంతో వెలుగులోకి వచ్చింది . జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది . చిన్నారి ఆసిఫా కు సత్వర న్యాయం జరుగుతుందా ? లేక కాలయాపన చేస్తూ కేసు నీరుగారి పోతుందా చూడాలి . నిర్భయ సంఘటన తర్వాత కఠినమైన చట్టాలు తెచ్చినప్పటికీ అత్యాచార సంఘటనలు మాత్రం ఆగడం లేదు .