ప్రభాస్20కి మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫర్మ్ అయినట్లేనా?


ప్రభాస్20కి మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫర్మ్ అయినట్లేనా?
ప్రభాస్20కి మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫర్మ్ అయినట్లేనా?

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రానికి ఓ డియర్ అన్నది కూడా టైటిల్ అని ప్రచారం జరుగుతోంది. ఈ రెండిట్లో ఏది అసలైన టైటిల్ అనేది త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాను జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఏడాదిన్నర నుండి ఈ సినిమా ప్రొడక్షన్ లో ఉంది. జార్జియాలో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతున్న సమయంలో కరోనా ప్రభావం కారణంగా షెడ్యూల్ ను అర్ధాంతరంగా ముగించి ఇండియా తిరిగి వచ్చిన విషయం తెల్సిందే.

ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరన్నది ముందు నుండి ప్రశ్నర్థకంగా గానే మారింది. ముందు అమిత్ త్రివేది అని పుకార్లు వచ్చాయి కానీ తర్వాత కాదని తేలిపోయింది. ఆ తర్వాత రకరకాల పేర్లు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం యువ తమిళ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

జస్టిన్ తెలుగులో డియర్ కామ్రేడ్ చిత్రానికి పనిచేసాడు. మెలోడీలు అందించడంలో జస్టిన్ శైలి వేరు. ఈ నేపథ్యంలో పీరియాడిక్ లవ్ స్టోరీ అయిన రాధే శ్యామ్ కు జస్టిన్ అయితే న్యాయం చేస్తాడని దర్శక నిర్మాతలు భావించారట. ఇప్పటికే జస్టిన్ ప్రభాకరన్ ట్యూన్స్ కు సంబంధించిన వర్క్ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగక తప్పదు.