జ్యోతిక సినిమాకు పైర‌సీ క‌ష్టాలు!

జ్యోతిక సినిమాకు పైర‌సీ క‌ష్టాలు!
జ్యోతిక సినిమాకు పైర‌సీ క‌ష్టాలు!

జ్యోతిక న‌టించిన తాజా త‌మిళ చిత్రం `పొన్ మ‌గ‌ల్ వందాల్‌`. ఈ చిత్రాన్ని హీరో సూర్య త‌న 2డీ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌పై నిర్మించారు. గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల్లో వున్న సూర్య క‌రోనా కార‌ణంగా ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో వివాదం త‌లెత్తినా, థియేట‌ర్ల యాజ‌మాన్యం త‌న సంస్థ‌లో నిర్మించిన చిత్రాల్ని బ్యాన్ చేస్త‌మ‌ని ఎదిరించినా సూర్య వెన‌క్కి త‌గ్గ‌లేదు.

అమెజాన్ ప్రైమ్ కోసం ఈ చిత్రాన్ని అత్య‌ధిక మొత్తానికి అమ్మేశారు. ఈ రోజే స్ట్రీమింగ్ అయింది. అయితే రిలీజ్ కు కొన్ని గంట‌ల ముందే ఈ చిత్రం పైర‌సీకి గురికావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. రిలీజ్‌కి ముందు రోజు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ వారి కోసం స్పెష‌ల్ ప్రీమియ‌ర్‌ని ప్లాన్ చేసి హెచ్‌డీ ప్రింట్‌ని ప్ర‌ద‌ర్శించార‌ట‌. ఈ క్ర‌మంలో ఈ చిత్ర హెచ్‌డీ ప్రింట్‌ని ఎవ‌రో దుండ‌గులు ఎత్తుకెళ్లిపోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

ఇదిలా వుంటే ఈ సినిమా చూసిన చిత్ర ప్ర‌ముఖులు హీరో సూర్య‌, జ్యోతిక‌తో పాటు ద‌ర్శ‌కుడిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కునిపిస్తున్నారు. ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌ల్లో హీరో, ద‌ర్శ‌కుడు కె. భాగ్య‌రాజా, పార్తీబ‌న్‌, పాండి రాజ‌న్ న‌టించారు.