చందమామ ని మర్చిపోతున్నామా? లేదా మర్చిపోయేలా చేసుకుంటుందా?


చందమామ ని మర్చిపోతున్నామా? లేదా మర్చిపోయేలా చేసుకుంటుందా?
చందమామ ని మర్చిపోతున్నామా? లేదా మర్చిపోయేలా చేసుకుంటుందా?

2019 సంవత్సరం లో తెలుగులో చేసిన సినిమాలు అన్ని బోల్తా కొట్టేసాయి. అసలు ఆ సినిమాలు ఎందుకు చేసిందో కూడా ఆమెకి, ఆమె అభిమానులకి అంతుచిక్కని సమస్యలా మారింది. కారణం ఏంటంటే అసలు సినిమాలు తియ్యడం తక్కువ చేసింది, ఆ సినిమాలు అప్పుడప్పుడు థియేటర్ లోకి వస్తున్నాయి. ఆ వస్తున్న సినిమాలు ఏమో కొంచెం కూడా బాగుండట్లేవు. మరి ఎలా? అభిమానులు తగ్గిపోతున్నారా? ఇంకా పెరుగుతున్నారా?

ఇంతకి నేను చెప్పేది ఎవరి గురించి అంటే మన టాలీవుడ్ చందమామ ‘కాజల్ అగర్వాల్’ని ఉద్దేశించి. గత సంవత్సరం నుండి ఆమె చేసిన సినిమాల లిస్ట్ చూసుకుంటే 2018 లో ‘అ’, ‘ఎం.ఎల్.ఏ’, ‘కవచం’ సినిమాలు ఉన్నాయి. ‘అ’ సినిమా తప్ప మిగిలిన సినిమాలు రెండు ఘోర పరాజయం అయ్యాయి. 2019 లో ఇప్పటివరకు 2 సినిమాలు చేసింది అవి కూడా ఘోర పరాజయాలు అయ్యాయి.  సినిమాలు ‘సీత’ మరియు ‘రణరంగం’. సీత సినిమాలో తన నటన చూడడానికి కొంచెం అయినా స్కోప్ దొరికింది కానీ, రణరంగం సినిమాలో చేసిన పాత్రకి అతిధి పాత్ర అని ఆమె అభిమానులే వెక్కిరించారు.

ఇప్పుడు చందమామ చేతిలో సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో గొప్పగా చెప్పుకోవాలంటే లోకనాయకుడు ‘కమల్ హాసన్’ – ‘శంకర్’ దర్శకత్వంలో లో వస్తున్న ”ఇండియన్ 2 (భారతీయుడు 2)” సినిమా ఉంది. తమిళ, తెలుగులో ఒకేసారి విడుదల చేయబోతున్నారు…… ‘2.O’ సినిమాతో నిరాశ పరిచిన శంకర్ గారు ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలి అని ఫిక్స్ అయిపోయారు. ‘కాల్ సెంటర్’ అని ఒక సినిమాకి సంతకం చేసింది మన కాజల్ అగర్వాల్. అ సినిమా ఇంగ్లీష్, తెలుగులో విడుదల అవ్వబోతుంది. తమిళంలో , హిందీ లో ఒక సినిమా చేయబోతుంది, అవి తెలుగులో విడుదల అవ్వవు. ఇక ‘ప్రభాస్’ 20 వ సినిమాగా తెరకెక్కుతున్న ‘జాన్’ సినిమాలో ఒక పాత్ర చేయబోతుంది కాజల్ అగర్వాల్.

సినిమాల పరంగా పెద్ద లిస్ట్ ఉన్నప్పటికీ మన చందమామకు హిట్ సినిమా పడి చాలా కాలం అయింది. ఆమెకి ఇంస్టాగ్రామ్ లో ట్విట్టర్ లో అభిమానులు ఎక్కువ. తను ఒక్క పోస్ట్ పెడితే లక్షల్లో జవాబులు ఆమెకి ఎదురు అవుతున్నాయి. ఇక అభిమానులు కోరుకుంటున్నట్టు తను కూడా మంచి హిట్టు కోసం ఎదురుచూస్తుంది, తను చేయాల్సింది చేసేసుకుంటూ హిట్ సినిమా థియేటర్ లో పడాలి అని తెగ కష్ట పడుతుంది.

ఇకపోతే ఇండియన్ 2 సినిమాలో చందమామ 70 ఏళ్ళ ముసలావిడ లాగా కనిపించబోతున్నారు. ఇండియన్ 2 సినిమాలో ఎక్కువ భాగం కమల్ హాసన్ గారు మనకి ముసలి వ్యక్తి గానే కనిపిస్తారు. హీరో ఆలా ఉన్నాడంటే హీరోయిన్ కూడా అలానే ఉండాలి కాబట్టి కమల్ హాసన్ గారికి సరిపోయేటట్టు గా 70 ఏళ్ళ ముసలావిడ లాగా మేక్ అప్ వేసుకుంటున్నారు. అసలు ఆ గెట్ అప్ లో ఎలా ఉండబోతుంది అని అందరు ఎదురుచూస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఇండియన్ 2 సినిమా ఒక ఎత్తు, ఈ సినిమా కోసం అమ్మడు కరాటే కూడా నేర్చుకుంటుంది. కమల్ హాసన్ గారితో పాటు పోరాట సన్నివేశంలో పాల్గొనటానికి సిద్ధం అవుతుంది.