సూర్య డప్పుకొట్టుకునే హీరో కాదు..మరి కలెక్షన్లు నమ్మొచ్చా?సూర్య డప్పుకొట్టుకునే హీరో కాదు..మరి కలెక్షన్లు నమ్మొచ్చా?
సూర్య డప్పుకొట్టుకునే హీరో కాదు..మరి కలెక్షన్లు నమ్మొచ్చా?

తమిళ హీరో ‘సూర్య’ కి 2019 తెలుగు, తమిళంలో మంచి సినిమా విజయాలు దక్కలేదు. 2018 ‘గ్యాంగ్’ సినిమానే తనకి నిజమైన హిట్ దక్కేలా చేసింది. ఆ సినిమా తమిళంలో కూడా బాగా హిట్ అయ్యింది. 2019 లో విడుదల చేసిన ఎన్.జి.కె. మరియు బందోబస్త్ సినిమాలు 2 రోజుల సమయంలోనే థియేటర్ లు లేక ఇంటికి తిరిగి వెళ్లిపోయాయి.

బందోబస్త్ సినిమా తెలుగులో ఆడలేకపోయింది…అయితే తమిళ అభిమానులకి ‘కాప్పాన్'(బందోబస్త్) బాగా నచ్చింది అంటున్నారు. ఎందుకంటే తెలుగు, తమిళంలో ఒకే రోజు రిలీజ్ అయిన సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు చోట్ల ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. తీరా ఇప్పుడు చూస్తే ఈ సినిమా 100 కోట్ల కబ్ లో చేరింది అంటూ సినిమా విజయోత్సవం జరుపుకుంటున్నారు.

చూస్కుంటే ఈ సంవత్సరం లో ఇలాంటి విజయం జరుపుకున్న సినిమాగా చరిత్రలో కాప్పాన్ (బందోబస్త్) ఉండబోతుంది. సూర్య గారికి సినిమా రివ్యూ వెంటనే తెలిసిపోతుంది అలాగే తను నటించిన సినిమాలు విఫలం అయితే తను బయటికి రాడు, వచ్చి ఇలాంటి
ఫెక్ కలెక్షన్స్ వాటిని అస్సలు ఎంకరేజ్ చెయ్యరు. అలాంటిది సూర్య గారు ఇప్పుడు కాప్పాన్'(బందోబస్త్) సినిమా విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే నమ్మశక్యం కలగట్లేదు.

కె.వి ఆనంద్ దర్శకత్వంలో, లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో ‘అల్లిరాజహ్ సుభాస్కరన్’ నిర్మాతగా వ్యవహరించిన సినిమా నిజంగా 100 కోట్లు సాదించిందా? లేదా కావాలని సూర్య ఇమేజ్ ని అడ్డం పెట్టుకుని ఈ తతంగం అంత నడుపుతున్నారా? అంటే ఆ విషయాలు పైనున్న భగవంతుడికే తెలియాలి అంటున్నారు తెలుగు సినిమా వర్గాల వాళ్ళు. ఒకవేళ నిజంగానే 100 కోట్లు రాబట్టిన సినిమా అయితే విజయోత్సవాలా వేడుక ఇంకా గట్టిగా జరపాలి కానీ సింపుల్ గా వదిలేస్తేనే పెద్ద అనుమానాలు వస్తాయి.