డ‌బ్బూ ర‌త్నానీ పార్టీలో స‌న్నీయోన్ గోల‌!


డ‌బ్బూ ర‌త్నానీ పార్టీలో స‌న్నీయోన్ గోల‌!
డ‌బ్బూ ర‌త్నానీ పార్టీలో స‌న్నీయోన్ గోల‌!

బాలీవుడ్ ఫేమ‌స్ ఫొటోగ్రాఫ‌ర్ డ‌బ్బూ ర‌త్నానీ గ‌త 25 ఏళ్లుగా బాలీవుడ్ స్టార్స్‌తో హాట్ హాట్ ఫొటో షూట్‌ల‌ని నిర్వ‌హిస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు. తాజాగా 2020 క్యాలెండ‌ర్ కోసం కూడా క్రేజీ బాలీవుడ్ స్టార్స్‌తో ఫొటోషూట్‌ని నిర్వ‌హించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోస‌ల్ మీడియాతో పాటు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారాయి. ఇందులో విద్యాబాల‌న్‌, కియారా అద్వానీ, భూమి ఫ‌డ్నేక‌ర్, స‌న్నీలియోన్‌ల ఫొటోల‌కి నెటిజ‌న్స్ క్లీన్ బౌల్డ్ అయిపోయారు.

త‌న క్యాలెండ‌ర్ ఫొటోషూట్ హ్యూజ్ స‌క్సెస్ కావ‌డంతో డ‌బ్బూ ర‌త్నాని క్యాలెండ‌ర్ షూట్‌లో పాల్గొన్న తార‌లు, టెక్నీషియ‌న్‌ల‌తో పాటు బాలీవుడ్ బిగ్గీస్‌కి గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశాడ‌ట‌. ఈ పార్టీలో పాల్గొన్న సీనియ‌ర్ బాలీవుడ్ న‌టుడు క‌బీర్‌బేడీ హాట్ గాళ్ స‌న్నీలియోన్ సెల్ నంబ‌ర్ అడిగిన‌ట్టు బాలీవుడ్‌లో ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ మ‌ధ్య‌లో స‌న్నీలియోన్ ద‌గ్గ‌రికి వెళ్లిన క‌బీర్ బేడీ ఆమె నంబ‌ర్ అడిగాడ‌ని, అయితే స‌న్నీ మాత్రం త‌న భ‌ర్త నంబ‌ర్ అత‌నికి ఇచ్చి షాకిచ్చింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ వార్త‌ల‌పై క‌బీర్ బేడీ వెంట‌నే స్పందించారు. తాను స‌న్నిలియోన్ నంబ‌ర్ అడ‌గ‌లేద‌ని, ఆమె భ‌ర్త నంబ‌ర్ అడిగాన‌ని, దానికే ఇంత రార్థాంతం చేస్తున్నార‌ని మండి ప‌డ్డారు. స‌న్నీలియోస్ భ‌ర్త డేనియ‌ల్ కూడా ఈ వార్త‌ల‌పై స్పందించారు. క‌బీర్‌బేడీ త‌న  నంబ‌ర్ అడిగితే త‌ప్పేంట‌ని, దీన్ని ఎందుకు అంతా పెద్ద స్టోరీగా చేసి చూపిస్తున్నార‌ని మండిప‌డ్డారు.