175 కోట్ల క్లబ్ లో కబీర్ సింగ్

Kabir singh 10 days collections
Kabir singh 10 days collections

షాహిద్ కపూర్ హీరోగా నటించిన కబీర్ సింగ్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది . సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 21 న భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే . అయితే సినిమా కు మొదట్లో డివైడ్ టాక్ వచ్చింది అలాగే పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి . దాంతో ఓ మోస్తారు విజయం సాధిస్తుందేమో అనుకున్నారు కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ రెండో వారంలోనే….. అంటే 10 రోజుల్లోనే 175 కోట్ల మైలురాయి ని దాటేసింది కబీర్ సింగ్ .

ఈ జోరు చూస్తుంటే 200 కోట్లు కాదు అంతకంటే ఎక్కువే వసూళ్లు సాధించేలా కనబడుతోంది . అవలీలగా 250 కోట్లు సాధించేలా ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు . షాహిద్ కపూర్ హీరోగా నటించగా కైరా అద్వానీ హీరోయిన్ గా నటించింది . తెలుగులో అర్జున్ రెడ్డి సంచలనం సృష్టించగా అంతకు మించి హిందీలో ప్రభంజనం సృష్టిస్తోంది .