అర్జున్ రెడ్డి రికార్డ్ ని బద్దలు కొట్టిన కబీర్ సింగ్


Kabir Singh
Kabir Singh

తెలుగునాట సంచలన విజయం సాధించిన చిత్రం అర్జున్ రెడ్డి , అయితే ఆ చిత్రం లాంగ్ రన్ లో కేవలం 51 కోట్ల ని మాత్రమే సాధించగా కబీర్ సింగ్ కేవలం మూడు రోజుల్లోనే 60 కోట్లకు పైగా వసూల్ చేసి అర్జున్ రెడ్డి రికార్డ్ ని బద్దలు కొట్టాడు కబీర్ సింగ్ .సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారగా , కబీర్ సింగ్ తో ఊహించని స్టార్ డం షాహిద్ కపూర్ సొంతం అవుతోంది .

జూన్ 21 న విడుదలైన కబీర్ సింగ్ మొదటి రోజున 20 కోట్ల షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది . క్రిటిక్స్ కబీర్ సింగ్ చిత్రాన్ని అడల్ట్ సినిమాగా తేల్చి పడేసారు కానీ ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పడ్తున్నారు దాంతో మూడు రోజుల్లోనే అర్జున్ రెడ్డి సాధించిన మొత్తం వసూళ్ల ని కేవలం మూడు రోజుల్లోనే సాధించి సంచలనం సృష్టించాడు కబీర్ సింగ్ . షాహిద్ కపూర్ చిత్రాల్లోనే నెంబర్ వన్ గా నిలిచింది కబీర్ సింగ్ . మూడు రోజుల్లోనే ఇంతటి వసూళ్లు వస్తే రాబోయే రోజుల్లో 150 కోట్ల మార్క్ ని చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదనుకుంటా !