370 కోట్ల వసూళ్లు సాధించిన కబీర్ సింగ్


Kabir Singh
Kabir Singh

షాహిద్ కపూర్ – కియారా అద్వానీ జంటగా నటించిన కబీర్ సింగ్ 370 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించి సంచలనం సృష్టించింది . కబీర్ సింగ్ ధాటిని ఆపాలని చాలా సినిమాలు ప్రయత్నించాయి కానీ మిగతా సినిమాల కన్నా కబీర్ సింగ్ కే ప్రేక్షకులు ఓటు వేయడంతో 370 కోట్ల గ్రాస్ వసూళ్లు , 200 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుంది కబీర్ సింగ్ చిత్రం . సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం 65 కోట్ల బడ్జెట్ తో తెరెకెక్కడం విశేషం .

తెలుగులో ప్రభంజనం సృష్టించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయగా తొలుత ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి . ఇక క్రిటిక్స్ అయితే ఈ చిత్రానికి 1 , 2 కి మించి రేటింగ్ ఇవ్వలేదు దాంతో ఏమో అనుకున్నారు కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ బాలీవుడ్ లో కూడా సంచలనం సృష్టించింది . దాంతో ఒక్కసారిగా షాహిద్ కపూర్ రేంజ్ మారిపోయింది .