అర్జున్ రెడ్డి హిందీ ట్రైలర్ వచ్చింది


అర్జున్ రెడ్డి హిందీ ట్రైలర్ వచ్చింది
Kabir Singh Trailer Poster

తెలుగునాట ప్రభంజనం సృష్టించిన చిత్రం అర్జున్ రెడ్డి , కాగా ఆ చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే . సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో షాహిద్ కపూర్ – కియారా అద్వానీ జంటగా నటించారు . అదే బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే వచ్చింది . ఇక ట్రైలర్ చూస్తుంటే అదే అర్జున్ రెడ్డి ని చూసినట్లుగా ఉంది . ఇప్పటికే విజయ్ దేవరకొండ ని ఆ పాత్రలో చూసాం కాబట్టి తెలుగువాళ్ళకు అంతగా ఎక్కలేదు కాకపోతే హిందీ వాళ్లకు తప్పకుండా నచ్చేలా ఉంది కబీర్ సింగ్ ట్రైలర్ .

ఈ చిత్రాన్ని జూన్ 21న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . తెలుగులో కల్ట్ మూవీ గా సంచలనం సృష్టించిన కబీర్ సింగ్ హిందీలో ఆ స్థాయిలో విజయం సాధిస్తుందా చూడాలి . కియారా అద్వానీ లిప్ లాక్ , షాహిద్ ఎగ్రెస్సివ్ యాక్టింగ్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలవనున్నాయి .