14 రోజుల్లో 210 కోట్లు సాధించిన కబీర్ సింగ్


Kabir singh two weeks collections

రెండు వారాల్లో 210 కోట్ల వసూళ్ల తో సంచలనం సృష్టిస్తున్నాడు షాహిద్ కపూర్ . కబీర్ సింగ్ గా షాహిద్ నటనకు జేజేలు పలుకుతున్నారు ప్రేక్షకులు . జూన్ 21 న విడుదలైన కబీర్ సింగ్ సంచలన విజయం సాధిస్తోంది . రెండు వారాలు పూర్తయినప్పటికీ ఇంకా మంచి వసూళ్ల ని రాబడుతూనే ఉంది కబీర్ సింగ్ .

 

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి . ఇప్పటికి కూడా వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి . అయినప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం ఎక్కడా తగ్గడమే లేదు కబీర్ సింగ్ జోరు . ఇక షాహిద్ విషయానికి వస్తే సోలో హీరోగా వంద కోట్ల వసూళ్ల నే సాధించలేకపోయాడు కానీ కబీర్ సింగ్ తో మాత్రం ఏకంగా 250 కోట్ల మైలురాయిని దాటేసేలా ఉన్నాడు . ఇక కియారా అద్వానీ కి కూడా భారీ హిట్ లభించింది కబీర్ సింగ్ రూపంలో .