కాజ‌ల్‌తో అత‌డి బంధం ఇప్ప‌టిది కాదా?


కాజ‌ల్‌తో అత‌డి బంధం ఇప్ప‌టిది కాదా?
కాజ‌ల్‌తో అత‌డి బంధం ఇప్ప‌టిది కాదా?

టాలీవుడ్ అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్రేమ‌, పెళ్లి గురించి గ‌త రెండు రోజులుగా హాట్ హాట్ చ‌ర్చ న‌డుస్తున్న‌విష‌యం తెలిసిందే. కాజ‌ల్ సోద‌రి నిషా అగ‌ర్వాల్ మ్యారేజ్ 2013లో జ‌రిగింది. అప్ప‌టి నుంచి కాజ‌ల్ పెళ్లిపై వార్త‌లు వ‌స్తూనే వున్నాయి. కాజ‌ల్ కూడా చెల్లేలు నిషా అగ‌ర్వాల్ త‌ర‌హాలోనే బిజినెస్‌మెన్‌ని వివాహం చేసుకుంటుంద‌ని వ‌రుస క‌థ‌నాలు వినిపించాయి.

ఇటీవ‌ల లాక్‌డౌన్ స‌మ‌యంలో సీక్రెట్ గా ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రిగింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ వార్త‌ల‌పై కాజ‌ల్ స్పందించ‌లేదు. తాజాగా ఇంటీరియ‌ర్ బిజినెస్‌మెన్  గౌత‌మ్ క‌చ్లూతో కాజ‌ల్ ప్రేమ‌లో వుంద‌ని, త్వ‌ర‌లో వీరిద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నార‌ని వరుస క‌థ‌నాలు వెలుగులోకి రావ‌డంతో కాజ‌ల్ మొత్తానికి ఓపెన్ అయ్యింది. గౌత‌మ్ క‌చ్లూని ఈ నెల 30న వివాహం చేసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది. అయితే వీరిద్ద‌రికి చాలా ఏళ్లుగా ప‌రిచ‌యం వుంద‌ని తెలుస్తోంది.

ఇన్‌స్టాలో కాజ‌ల్ షేర్ చేసిన ఫొటోలు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ వ‌ల్ల గౌత‌మ్ కిచ్లూతో కాజ‌ల్‌కి ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ని, అది ప్రేమ‌గా మారింద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం గౌత‌మ్ `డిసెర్న్ లివింగ్‌` ఇంటీరియ‌ర్ బిజినెస్ కంపెనీకి సీఈఓగా వున్నారు. అంతే కాకుండా అత‌ను మంచి అథ్లెట్ కూడా అని తెలిసింది.