కాజ‌ల్ అప్పుడే కొత్త ఇంటి ఏర్పాట్లు!


కాజ‌ల్ అప్పుడే కొత్త ఇంటి ఏర్పాట్లు!
కాజ‌ల్ అప్పుడే కొత్త ఇంటి ఏర్పాట్లు!

అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో వున్న గౌత‌మ్ కిచ్లూని వివాహం చేసుకోబోతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించి షాకింగ్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో వున్న ఈ జంట ఈ నెల 30న పెళ్లి బంధంతో ఒక్క‌టి కాబోతున్నారు. ముంబైలో అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే ఈ వివాహ వేడుక‌లో పాల్గొననున్నారు. ‌

ఇదిలా వుంటే పెళ్లి ఏర్పాట్ల‌తో పాటు పెళ్లి త‌రువాత వుండ‌బోయే ఇంటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జ‌రిగిపోతున్నాయి. కాజ‌ల్‌ని వివాహం చేసుకుంటున్న గౌత‌మ్ కిచ్లూ ఓ బిజినెస్‌మెన్‌. అంతే కాకుండా ఇంటీరియ‌ర్ బిజినెస్‌కు సంబంధించిన కంపనీని ర‌న్ చేస్తున్నారు. ఇప్ప‌టికే సొంత ఇంటిని కొనేసుకున్న కాజ‌ల్ అండ్ గౌత‌మ్ ఆ ఇంటిలోని ఇంటీరియ‌ర్ డిజైన్‌ని త‌మ‌కు న‌చ్చిన‌ట్టుగా డిజైన్ ఏసుకుంటున్నారు.

ఇదే విష‌యాన్ని సోష‌ల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డించింది కాజ‌ల్. కొత్త ఇంట్లో జ‌రుగుతున్న వ‌ర్క్‌కి సంబంధించిన ఓ ఫొటోని షేర్ చేసిన కాజ‌ల్ కొత్త ఇంటిలో వ‌ర్క్ జ‌రుగుఓంది. ఏమైనా స‌ల‌హాలు సూచ‌న‌లు ఇస్తారా? అని అభిమానుల‌ని అడిగింది. కాజ‌ల్ ప్ర‌స్తుతం క‌మ‌ల్‌తో `ఇండియ‌న్ 2`, చిరుతో `ఆచార్య‌`, మంచు విష్ణుతో `మోస‌గాళ్లు` చిత్రాల్లో న‌టిస్తోంది.