ఫొటో స్టోరీ: చంద‌మామ బికినీ ట్రీట్ఫొటో స్టోరీ: చంద‌మామ బికినీ ట్రీట్
ఫొటో స్టోరీ: చంద‌మామ బికినీ ట్రీట్

సోష‌ల్ మీడియాని స్టార్స్, సెల‌బ్రిటీలు వాడుకున్నంత‌గా మ‌రెవ‌రూ వాడుకోవ‌డం లేదు. పుట్టిన రోజు ద‌గ్గ‌రి నుంచి ప్ర‌తీ విష‌యాన్ని వెంట‌నే సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. ప్ర‌చారానికి, పాపులారిటీకి బాగా వాడేసుకుంటున్నారు. గ‌త కొంత కాలంగా స‌రైన హిట్‌లు లేని చంద‌మామ‌ కాజ‌ల్ అగ‌ర్వాల్ సోష‌ల్ మీడియాని బాగా వాడేస్తోంది. ట్విట్టర్ కంటే ఇన్ స్టాగ్రామ్‌నే బాగా వాడేస్తోంది. త‌న‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని, ప్ర‌తీ హాపెనింగ్‌ని ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ నిత్యం త‌న అభిమానుల‌కు అందు బాటులో వుంటోంది.

కాజ‌ల్ అగ‌ర్వాల్‌ని ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న వారి సంఖ్య 12.8 మిలియ‌న్‌లు. ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ని మెయింటైన్ చేస్తున్న‌కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న కుటుంబంతో క‌లిసి మ‌ల్దీవ్స్‌లో వెకేష‌న్‌కి వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డ చంద‌మామ కుటుంబ స‌భ్య‌ల‌తో క‌లిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫొటోల్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసి హంగామా చేస్తోంది. తాజాగా బికినీ ధ‌రించి కాజ‌ల్ స్విమ్మింగ్ పూల్‌లో బాత్ ఆకార‌పు బెలూన్‌పై హ‌ల్ చ‌ల్ చేసింది. దానికి సంబంధించిన ఫొటోల్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అవి ఇప్ప‌డు వైర‌ల్‌గా మారాయి.

కాజ‌ల్ పోస్ట్ చేసిన బికినీ ఫొటోకు దాదాపు 8 ల‌క్ష‌ల లైక్‌లు రాగా ఆరు వేల‌కు మించి కామెంట్స్ రావ‌డం విశేషం. కాజ‌ల్ ప్ర‌స్తుతం మోస‌గాళ్లు, ముంబై సాగా, భార‌తీయుడు 2 చిత్రాల్లో న‌టిస్తోంది. ఇందులో `మోస‌గాళ్లు` హాలీవుడ్‌లోనూ రిలీజ్ కాబోతోంది. మిగ‌తా రెండు చిత్రాలు తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ విడుద‌ల కానున్నాయి.

 

View this post on Instagram

 

?

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

 

View this post on Instagram

 

#ridingflamingos

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

 

View this post on Instagram

 

#pinkflamingo ? #lounging #floating #muchlikelife

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

Credit: Instagram