పెళ్లి త‌రువాత కాజ‌ల్ రూల్స్ మార్చేస్తోందా?

పెళ్లి త‌రువాత కాజ‌ల్ రూల్స్ మార్చేస్తోందా?
పెళ్లి త‌రువాత కాజ‌ల్ రూల్స్ మార్చేస్తోందా?

కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న చిర‌కాల మిత్రుడు, ప్రియుడు అయిన గౌత‌మ్ కిచ్లూని ఇటీవ‌ల వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే.  వివాహం త‌రువాత భ‌ర్త కిచ్లూతో క‌లిసి మాల్దీవుల‌కు హ‌నీమూన్‌కి వెళ్లింది. అక్క‌డి అందాల మ‌ధ్య విహ‌రిస్తూ భ‌ర్త‌తో క‌లిసి ఫొటోల‌కు పోజులిస్తూ ప‌ర‌వ‌శించిపోయింది. హ‌నీమూన్ కోసం భారీగానే ఖ‌ర్చు చేసిన కాజ‌ల్ ఇటీవ‌లే త‌న హ‌నీమూన్ వెకేష‌న్‌ని ముగించుకుని ముంబై చేరుకుంది.

వెంట‌నే షూటింగ్‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈ మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత నిరంజ‌న్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఇదిలా వుంటే పెళ్లి త‌రువాత  కాజ‌ల్ కొత్త రూల్స్ పెడుతోందా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. విఘ్నేష్ శివ‌న్‌తో స‌హ‌జీవ‌నం మొద‌లుపెట్టిన త‌రువాత న‌య‌న‌తార కొత్త రూల్స్ పెట్ట‌డం మొద‌లుపెట్టింది.

అదే త‌ర‌హాలో కాజ‌ల్ కూడా కొత్త‌గా స్కిన్ షో చేయ‌ను, హ‌ద్దులు దాటి హీరోల‌తో రొమాన్స్ చేయ‌ను వంటి కండీష‌న్స్ పెడుతుంద‌ని అంతా భావించారు కానీ కాజ‌ల్ మాత్రం ఎప్ప‌టి లాగే దేనికైనా రెడీ అంటోంది. దీంతో కాజ‌ల్ న‌య‌న‌తారలా రూల్స్ మార్చ‌లేదంటున్నారు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. కాజ‌ల్ త్వ‌ర‌లో `ఆచార్య‌` సెట్‌లో అడుగుపెట్ట‌బోతోంది.