స‌న్‌సెట్‌ని ఎంజాయ్ చేస్తోంది!


Kajal Agarwal enjoying sunset
Kajal Agarwal enjoying sunset

కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు షూటింగ్‌ల నుంచి విరామం చిక్క‌డంతో ఫ్యామిలీతో క‌లిసి విహార యాత్ర‌కు వెళ్లింది.
చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం మాల్దీవ్స్‌లో విహ‌రిస్తూ ఎంజాయ్ చేస్తోంది. కుటుంబంతో క‌లిసి వెకేష‌న్‌కి వెళ్లిన కాజ‌ల్ అక్క‌డి అందాల మ‌ధ్య దిగిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తోంది. ఆ ఫొటోల‌న్నీ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి. తాజాగా మ‌రో పిక్‌ని షేర్ చేసింది. పింక్  స్లీవ్ లెస్ డ్రెస్‌లో ద‌ర్శ‌నిమిచ్చింది. అయితే ఈ ఫొటోల్లో కాజ‌ల్ వైన్ తాగుతూ మేక‌ప్ లేకుండా క‌నిపిస్తోంది. స‌న్ సెట్‌ని ఎంజాయ్ చేస్తున్న కాజ‌ల్ ఫొటోలు ఇన్‌స్టాలో ఆక‌ట్టుకుంటున్నాయి.

ఈ ఫొటోల‌తో పాటు కాజ‌ల్ షేర్ చేసిన పోస్ట్ ఆస‌క్తిక‌రంగా మారింది. `స‌ముద్ర‌పు గాలుల మ‌ధ్య బీచ్ ప‌క్క‌న అహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో వైన్ తాగుతూ స‌న్ సెట్‌ను ఎంజాయ్ చేయడం మ‌ర్చిపోలేని అనుభూతిని క‌లిగిస్తోంది. నిజ‌మైన ఆనందం అంటే ఇదేనేమో. ఈ ఆనందం రెట్టింప‌యింది. ఈ ట్రిప్ కార‌ణంగా చేసిన ట్రాన్సెక్ష‌న్‌ల వ‌ల్ల 1 శాతం క్యాష్ బ్యాక్ పొందాను` అని కాజ‌ల్ చిలిపిగా రాసుకొచ్చింది. పింక్ గౌన్‌లో కనిపిస్తున్న కాజ‌ల్ అందాల‌ని నెటిజ‌న్స్ ఆస్వాదిస్తూ ఆమెకు ఇన్‌స్టాలో ల‌వ్ ఎమోజీల‌ని పంపిస్తున్నారు.
ఇన్‌స్టాలో కాజ‌ల్ పోస్ట్ చేసిన ఈ ఫొటోని ఇప్ప‌టి వ‌ర‌కు 9ల‌క్షల 20 వేల మంది లైక్ చేశారు.

ఇటీవ‌ల వ‌రుస ఫ్లాప్‌ల‌ని సొంతం చేసుకున్న కాజ‌ల్‌పై ఆ ప్ర‌భావం ఏమీ క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వున్నారామె. క‌మ‌ల్‌హాస‌న్‌తో క‌లిసి కాజ‌ల్ `ఇండియ‌న్ 2` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. త్వ‌రలొనే ఈ సినిమా షూటింగ్‌లో చంద‌మామ కాజ‌ల్ పాల్గొన‌బోతోంది. దీనితో పాటు మంచు విష్ణు న‌టిస్తున్న మోస‌గాళ్లు`, ముంబైసాగా చిత్రాల్లోనూ న‌టిస్తున్నది.