ఫ్యాన్స్ తో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న కాజల్

ఫ్యాన్స్ తో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న కాజల్
ఫ్యాన్స్ తో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న కాజల్

కరోనా వైరస్ వ్యాప్తిని భారతదేశంలో అరికట్టే ప్రయత్నం లో భాగంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ నటిస్తున్న సంగతి తెలిసిందే ఇక ప్రజలు బయటకు వెళ్లి సినిమాలు షికార్లు చేయడానికి అవకాశం లేని ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఉండి తమకు ఉన్నంతలో వినోదాన్ని పొందటానికి ఉన్న ఏకైక మార్గం ఒకటి టీవీ, రెండోది సెల్ ఫోన్. ప్రస్తుతం సెల్ ఫోన్ కూడా  వినోదం అందించడానికి కంటే ముందు రకరకాల నోటిఫికేషన్ల తో, ఫేక్ వార్తలతో, పుకార్లతో మనసులను కలుషితం చేస్తున్న సంగతి ప్రజలకు ఇంకా అర్థం కావడం లేదు. ఆ విషయాన్ని పక్కన పెడితే టీవీలో  చానల్స్ వారు తమ పాత సీరియల్స్ ను సినిమాలను రియాలిటీ షోలను పునః ప్రసారం చేస్తున్నారు.

ఇక ప్రపంచ ప్రఖ్యాత సినిమా నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ వారు హాట్ స్టార్ వారి భాగస్వామ్యం తో గత ఏడాది వారు విడుదల చేసిన సూపర్ హిట్ సినిమా “లయన్ కింగ్” ను లో ప్రసారం చేశారు. ఈ సినిమా గత ఏడాది అన్ని భారతీయ భాషలలోను విడుదలైంది. సంచలన విజయం కూడా సాధించింది. హాలీవుడ్ సినిమాలు సరైన డబ్బింగ్ వర్క్ మరియు పబ్లిసిటీ చేస్తే మన దేశంలో ఎంత మార్కెట్ సృష్టించుకో కలుగుతాయో..? నిరూపించింది. ఇక మన అందాల తార కాజల్ కూడా ముందు రోజే మనమందరం కలిసి హాట్ స్టార్ లో సినిమా చూద్దామనీ.. ఆ తర్వాత లైవ్ చాటింగ్ లో మాట్లాడుకుందామని అభిమానులకు ఆఫర్ ఇచ్చింది. ఈ సందర్భంగా తాను “లయన్ కింగ్” సినిమా చూస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. “తన చిన్నప్పటి నుంచి డిస్నీ వారి కార్యక్రమాలు చూస్తూ పెరిగానని; ఇప్పుడు లైన్ కింగ్ సినిమా ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి గా అది కూడా తెలుగులో చూడటం చాలా ఆనందంగా ఉందని” కాజల్ తెలిపింది.

Credit: Twitter