సెన్సార్ ఇబ్బందుల్లో కాజల్ సినిమా


Kajal Aggarwal
Kajal Aggarwal

కాజల్ అగర్వాల్ నటించిన ” పారిస్……. పారిస్ ” చిత్రం సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొంటోంది . బాలీవుడ్ లో విజయం సాధించిన క్వీన్ చిత్రాన్ని తమిళ్ లో” పారిస్ ….. పారిస్ ” గా రీమేక్ చేసారు . ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తిచేసుకుంది కానీ ఏదో ఇబ్బందుల వల్ల ఇనాళ్ళు బయటకు రాలేకపోయింది . తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెన్సార్ సమస్యతో రిలీజ్ కష్టంగా మారిందని తెలుస్తోంది .

పారిస్ …… పారిస్ చిత్రానికి సెన్సార్ సమస్యలు ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పై కొన్ని బూతు సన్నివేశాలు ఉన్నాయట అలాగే బూతు డైలాగ్స్ కూడా ఉన్నాయట దాంతో వాటిని తొలగించాలని చెప్పారట సెన్సార్ సభ్యులు అందుకే సతమతం అవుతున్నారు పారిస్ పారిస్ చిత్ర బృందం . సెన్సార్ ఇబ్బందులను అధిగమిస్తే కాజల్ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది మరి .