మెగాస్టార్ చిత్రానికి హీరోయిన్ ఫిక్స్‌!


Kajal agarwal final to megastar acharya
Kajal agarwal final to megastar acharya

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌రు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాటినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ ఆల్ మోస్ట్ సగానికిపైగానే పూర్తయిన‌ట్టు చిత్ర వ‌ర్గాల స‌మాచారం.
చిరు ఎండోమెంట్ అధికారిగా. ప్ర‌జా నాట్య‌మండ‌లి కార్య‌క‌ర్త‌గా కొత్త త‌ర‌హా పాత్ర‌లో న‌టిస్తున్నారు.

సినిమా ప్రారంభం నుంచి వార్త‌ల్లో నిలుస్తోంది. కెమెరామెన్ మార్పు విష‌యంలో వార్త‌ల్లో నిలిచిన ఈ చిత్రం ఆ త‌రువాత వ‌రుస కథ‌నాల‌తో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇందులో తాజాగా హీరోయిన్ కార‌ణంగా మ‌ళ్లీ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ చిత్రం కోసం ముందు త్రిష‌ని హీరోయిన్‌గా ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఇటీవ‌ల త‌న‌కు, టీమ్‌కు మ‌ధ్య త‌లెత్తిన క్రియేటీవ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా ఈ చిత్రం నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని, ముందు అనుకున్న‌వి ఆ త‌రువాత మ‌రోలా మారుతుంటాయి. అందుకే ఈ చిత్రం నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా త్రిష ప్ర‌క‌టించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్‌ని ఫిక్స్ చేశారు. అయితే ఇందులో న‌టించ‌డానికి కాజ‌ల్‌భారీగానే డిమాండ్ చేసిందంట‌. ఆమె అడిగినంత ఇవ్వ‌డానికి అంగీక‌రించిన రామ్‌చ‌ర‌ణ్ మొత్తానికి  ఆమెని ఫైన‌ల్ చేసేశారు. వ‌చ్చే నెల నుంచి కాజ‌ల్ షూటింగ్‌లో పాల్గొన‌బోతోంది. క‌రోనా కార‌ణంగా `ఆచార్య‌` షూటింగ్‌ని తాత్కాలికంగా నిలిపివేసిన విష‌యం తెలిసిందే.