కాజల్ ప్రేమించిన హీరో ఎవరో


kajal agarwal in love with tollywood hero

కాజల్ అగర్వాల్ సినిమాల్లోకి వచ్చాక ఒక హీరో ని ప్రేమించానని కానీ ప్రేమించడానికి , కబుర్లు చెప్పుకోవడానికి తగినంత సమయం లేదు కాబట్టి ప్రేమ ని పక్కన పెట్టానని సంచలన వ్యాఖ్యలు చేసింది . అంతేకాదు సినిమాల్లోకి రాకముందు కూడా ఒకరిని ప్రేమించానని మొత్తానికి నా జీవితంలో ఇప్పటివరకు ఇద్దరినీ ప్రేమించానని సినిమాల్లోకి రాకముందు ఒకరిని కాగా సినిమాల్లోకి వచ్చాక ఇక్కడొక హీరోని ప్రేమించానని చెప్పి షాక్ ఇచ్చింది .

 

తెలుగులో మహేష్ బాబు , ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ , రాంచరణ్ , ప్రభాస్ లాంటి అగ్ర హీరోలతో పాటుగా పలువురు యంగ్ హీరోలతో కూడా నటించింది కాజల్ అగర్వాల్ . అయితే తెలుగులో ఏ హీరోని ప్రేమించిందో మాత్రం అతడి పేరు మాత్రం బయట పెట్టలేదు ఈ భామ . దాంతో రకరకాల పేర్లు తెరమీద కు వస్తున్నాయి . ఇంతకీ కాజల్ అగర్వాల్ ప్రేమించిన హీరో ఎవరో ?