హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో చంద‌మామ‌!


హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో చంద‌మామ‌!
హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో చంద‌మామ‌!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా సినీ రంగం కుదేలైపోయింది. షూటింగ్‌లు బంద్‌, థియేట‌ర్లు బంద్‌, రిలీజ్‌లు బంద్‌.. ఇలా ప్ర‌తీదీ బంద్ కావ‌డంతో అంద‌రి చూపు ఇప్పుడు ఓటీటీల‌పై ప‌డింది. రిలీజ్‌కు సిద్ధంగా వున్న చిత్రాలు ఓటీటీకి సై అంటుంటే సినిమా షూటింగ్ లు ఆగిపోవ‌డంతో క్రేజీ స్టార్స్ , డైరెక్ట‌ర్స్ వెబ్ సిరీస్‌ల బాట‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం వీటికే భారీ డిమాండ్ ఏర్ప‌డంతో అంతా ఆ వైపు అడుగులు వేయ‌డం మొద‌లుపెట్టారు.

బాలీవుడ్‌లో ఇప్ప‌టికే క్రేజీ తార‌ల్లో కొంత మంది వెబ్ సిరీస్‌ బాట ప‌ట్ట‌గా ఇప్పుడిప్పుడే టాలీవుడ్ హీరోలు, హీరోయిన్‌లు ఓటీటీల వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ వెబ్ సిరీస్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. గ‌త కొన్ని రోజులుగా కాజ‌ల్ వెబ్ సిరీస్ చేయ‌బోతోంద‌టూ వార్త‌లు షికారు చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్రియాంక చోప్రా న‌టించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ `క్వాంటికో`. సూప‌ర్ హిట్ గా నిలిచిన ఈ వెబ్ సిరీస్‌ని త్వ‌ర‌లో రీమేక్ చేయ‌బోతున్నారు.

ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించ‌నున్న‌ట్టు తెలిసింది. ప్రియాంక చోప్రా పోషించిన పాత్ర‌ని కాజ‌ల్ అగ‌ర్వాల్ చేయ‌నుంద‌ని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే వెలువ‌డ నుంద‌ని చెబుతున్నారు. ఈ వార్త‌ల్లో వున్న నిజ‌మెంతో తెలియాలంటే మేక‌ర్స్ ప్ర‌క‌టించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.