మ‌ళ్లీ ఆనాటి రోజుల్ని గుర్తు చేసిందట‌!మ‌ళ్లీ ఆనాటి రోజుల్ని గుర్తు చేసిందట‌!
మ‌ళ్లీ ఆనాటి రోజుల్ని గుర్తు చేసిందట‌!

ప్ర‌పంచం క‌రోనా గుప్పిట్లో బందీగా మారిపోయింది. కంటికి క‌నిపించ‌ని సూక్ష్మ‌జీవితో యుద్ధం చేస్తోంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఇటలీలో శుక్ర‌వారం 969 మంది మృత్యువాత ప‌డ్డారు. దీని ప్ర‌భావం ప్ర‌స్తుతం అమెరికాలోనూ మొద‌లైంది. అక్క‌డ వేల సంక్ష‌లో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే అమెరికాలో పాజిటివ్ కేసుల సంక్ష ల‌క్ష దాటేసింది. దీంతో కొన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించింది.

ఇదిలా వుంటే మ‌న దేశంలోనూ దీని ప్ర‌భావం ఉదృతంగానే క‌నిపిస్తోంది. రోజు రోజుకీ క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే వున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ని 21 రోజుల పాటు ప్ర‌క‌టించారు. దీంతో ప్ర‌జ‌లంతే ఇళ్ల‌కే ప‌రిమిత‌మై టీవీల‌కు అతుక్కుపోయారు. కొంత మంది అమెజాన్ ప్రైమ్‌, నెట్ ఫ్లిక్స్‌ల‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తూ కాల‌క్షేపం చేస్తుంటే కాజ‌ల్ అగ‌ర్వాల్ మాత్రం టీవీ చూస్తోంది. ఇంటికే ప‌రిమిత‌మైన హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌ డీడీ ఛాన‌ల్ లో ప‌బ్లిక్ డిమాండ్ మేర‌కు నేటి నుంచి పునః ప్రారంభం అయిన `రామాయ‌ణ్‌` సీరియ‌ల్ని చూస్తోంద‌ట‌.

1987లో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన రామానంద‌సాగ‌ర్ `రామాయ‌ణ్‌` చూస్తుంటే త‌న‌కు చిన్న‌నాటి రోజులు గుర్తొచ్చాయ‌ట‌. అప్ప‌ట్లో త‌న వారాంతాలు దీనితోనే గ‌డిచిపోయేవ‌ని, అల‌నాటి ఆణిముత్య‌మైన `రామాయ‌ణ్‌`ని పునః ప్ర‌సారం చేయ‌డం ఆనందాన్ని క‌లిగిస్తోంద‌ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

Credit: Twitter