కాజ‌ల్ అగ‌ర్వాల్ ఏం నేర్చుకుంటోంది!


కాజ‌ల్ అగ‌ర్వాల్ ఏం నేర్చుకుంటోంది!
కాజ‌ల్ అగ‌ర్వాల్ ఏం నేర్చుకుంటోంది!

క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని అత‌లాకుత‌రం చేస్తోంది. ఇప్ప‌టికే దీని బారిన ప‌డిన దేశాల‌న్నీ మ‌ర‌ణ మృదంగాన్ని మోగిస్తున్నాయి. ఇట‌లీలో మ‌ర‌ణాల సంక్ష రోజు రోజుకూ పెరుగుతోంది. అమెరికాని కూడా ఈ వైక‌స్ ప‌ట్టి పీడిస్తోంది. అక్క‌డ కూడా మ‌ర‌ణాల సంక్ష గ‌ణ‌నీయంగా పెరిగే జూచ‌న‌లే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. దీంతో క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌ల‌కు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.

చైనా, ఇట‌లీ, అమెరికా, స్పెయిన్‌ల‌ని దృష్టిలో పెట్టుకుని మ‌న దేశం లాక్ డౌన్‌కు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ గ‌త వారం రోజులుగా లాక్ డౌన్ ని ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయిపోయారు. సెల‌బ్రిటీలు కూడా షూటింగ్‌లు బంద్ కావ‌డంతో ఇంటికే ప‌రిమితం అయిపోయారు. త‌మ‌కు న‌చ్చిన పనుల్లో బిజీ అయిపోయారు.

కాజ‌ల్ అగ‌ర్వాల్ మాత్రం క‌ళ‌రి విద్య‌ని నేర్చుకుంటూ బిజీగా గ‌డిపేస్తోంది.  కాజ‌ల్ `ఇండియ‌న్ 2` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా శంక‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై అల్లిరాజా సుభాస్క‌ర‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజ‌ల్‌పై పోరాట ఘ‌ట్టాలు చిత్రీక‌రించాల్సి వుంద‌ట‌. ప్రాచీక క‌ళారి పోరాట ప‌ద్ద‌తుల్లో ఈ ఫైట్ వుండ‌టంతో కాజ‌ల్ క‌ళారి విద్య‌ని ఈ క్వాఎంటైన్ స‌మ‌యంలో నేర్చుకుంటోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మార్పులు వ‌చ్చాక `ఇండియ‌న్ 2` రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుంద‌ట‌. ఈ షెడ్యూల్‌లో త‌న‌పై పోరాట ఘ‌ట్టాల్ని చిత్రీక‌రిస్తార‌ని కాజ‌ల్ తెలిపింది.