చందమామ రావే అంటే అంత సులభంగా రాదు….kajal aggarwal
kajal aggarwal

నేను చెప్పేది ఆకాశంలో ఉన్న చందమామ కాదు, మన తెలుగు సినిమా చందమామ “కాజల్ అగర్వాల్ ” గురించి. మన చందమామ నిన్నటి నుండి తన ట్విట్టర్ లో అభిమానులతో సరాసరి మాట్లాడటం మొదలు పెట్టింది. ఇంక అభిమానులు ఊరుకుంటారా?

అనుకున్నట్టుగానే అభిమానులు నుండి ఒక ప్రశ్న వచ్చింది, అది ఏంటంటే “నన్ను పెళ్లి చేసుకుంటారా” అని ఒక అభిమాని అడిగితే, దానికి కాజల్ వెంటనే స్పందించి “అంత సులభం కాదు, కాని ప్రయత్నం చేయండి” అని సింపుల్ గా బదులు ఇచ్చింది.

ఇంక అంతే అప్పటినుడి అభిమానుల దగ్గర నుండి కుప్పలుగ వచ్చి పడుతున్నాయి ట్వీట్లు, ఎందుకంటేవాళ్ళకి కూడా రిప్లై ఇస్తుంది అని చిన్న ఆశ.

ప్రతి ఒక్కరికి  ఉంటుంది కదా మన చందమామ నుంచి రిప్లై రావాలి అని. అలా దీనంగా చూసేవాళ్ళకి ఆ దేవుడే కరుణించాలి ఇగా.