కాజల్ పెళ్లి.. ఆ సినిమా అయిపోగానే?


కాజల్ పెళ్లి.. ఆ సినిమా అయిపోగానే?
కాజల్ పెళ్లి.. ఆ సినిమా అయిపోగానే?

టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా అందరి హీరోలతో జత కడుతున్న భామ కాజల్ అగర్వాల్. టాలీవుడ్ చందమామ గా అమ్మడు గత 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టడీగా కెరీర్ ని కొనసాగించింది. ఇక అమ్మడు వెళ్లిపోయే టైమొచ్చింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చాలా వరకు కాజల్ కి మెల్లమెల్లగా అవకాశాలు తగ్గుతున్నాయని కూడా టాక్ వస్తోంది.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ డార్లింగ్ బేబీ త్వరలో పెళ్లి పీటలెక్కే అవకాశం ఉందని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మెయిన్ గా తన బిగ్ ప్రాజెక్ట్ అయిపోగానే అమ్మడు మూడు ముళ్ళు వేయించుకోవడానికి రెడీ కానుందట. ఆ బిగ్ ప్రాజెక్ట్ మరేదో కాదు. కమల్ హసన్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2. ఈ సినిమా రావడానికి ఇంకా ఏడాది సమయం పడుతుంది. లేదా అంతకంటే ఎక్కువ సనయం కూడా పట్టవచ్చు.

ఆ ప్రాజెక్ట్ అయిపోగానే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులకు ఒక క్లారిటీ అయితే ఇచ్చిందట. ప్రస్తుతం కాజల్ ఒక బిజినెస్ మెన్ తో ప్రేమలో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. చందమామ అతన్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినట్లు కూడా టాక్ వస్తోంది. అయితే ఆ విషయాన్ని పెళ్లికి కొన్నిరోజుల ముందే బయటపెట్టాలని అమ్మడు సీక్రెట్ గా ఉంచుతున్నట్లు సమాచారం.