వెబ్ సిరీస్ చేస్తున్న చంద‌మామ‌!


వెబ్ సిరీస్ చేస్తున్న చంద‌మామ‌!
వెబ్ సిరీస్ చేస్తున్న చంద‌మామ‌!

వెండితెర‌పై అందాల చంద‌మ‌మా కాజ‌ల్ అగ‌ర్వాల్‌. పుష్క‌ర కాలం దాటుతున్నా ఇప్ప‌టికీ కాజ‌ల్ క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. వ‌రుస మేజ‌ర్ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తోంది. సీనియ‌ర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవితో `ఆచార్య‌`, క‌మ‌ల్‌హాస‌న్‌తో `ఇండియ‌న్ 2` చిత్రాల్లో న‌టిస్తున్న కాజ‌ల్ మంచు విష్ణుతో క‌లిసి `మోస‌గాళ్లు` చిత్రంలో సిస్ట‌ర్‌గా ఇంట్రెస్టింగ్ క్యారెక్ట‌ర్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

వీటితో పాటు కాజ‌ల్ `ముంబై సాగా` పేరుతో రూపొందుతున్న హిందీ చిత్రంలోనూ న‌టిస్తోంది. ఇదిలా వుంటే సినిమాల్లో బిజీగా వున్న కాజ‌ల్ డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లోకి ఎంట‌ర్ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఓటీటీల్లో వెబ్ సిరీస్‌ల క్రేజ్ పెరిగిపోవ‌డంతో ఈ రంగంలోనూ ఎంట‌ర్ కాబోతోంద‌ట‌. ప్రియాంక చోప్రా `క్వాంటి కో` పేరుతో ఓ సిరీస్‌లో న‌టించిన విష‌యం తెలిసిందే.

ఇదే సిరీస్‌ని తెలుగులో నెట్‌ప్లిక్స్ నిర్మించాల‌ని ప్లాన్ చేస్తోంది. దీన్ని భార‌తీయ భాష‌ల్లో రిలీజ్ చేస్తార‌ట‌. అయితే ఇందులో తొలిసారి కాజ‌ల్ మ‌రింత స్పైసీగా క‌నిపించి షాకివ్వ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తాజా టాక్‌. ప్రియాంక చోప్రా ఈ సిరీస్‌లో హాట్ హాట్ స‌న్నివేశాల్లో న‌టించింది. అదే త‌ర‌మాలో కాజ‌ల్ కూడా క‌నిపించి షాకివ్వ‌నుంద‌ట‌.