రవితేజ తో నటించకపోవడానికి రీజన్ చెప్పింది


kajal agarwal rejected raviteja film

మాస్ మహారాజ్ రవితేజ సరసన శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించడానికి ముందుగా ఒప్పుకుంది కాజల్ అగర్వాల్ అయితే తీరా షూటింగ్ కి అంతా సిద్ధం చేసుకుంటున్న సమయంలో నేను నటించడం లేదని ఆ చిత్ర యూనిట్ కి షాక్ ఇచ్చింది ఈ భామ దాంతో కాజల్ అగర్వాల్ స్థానం లో అను ఇమ్మాన్యు యేల్ ని ఎంపిక చేసారు శ్రీను వైట్ల . అయితే సడెన్ గా రవితేజ సినిమాలో నటించకపోవడానికి కారణం ఏంటో తెలియలేదు .

తాజాగా కాజల్ అగర్వాల్ రవితేజ సినిమాని రిజెక్ట్ చేయడానికి కారణం చెప్పింది . ఇప్పటివరకు చేసిన సినిమాల ప్రమోషన్ లు ఉన్నాయి అలాగే కొత్తగా అంగీకరించిన సినిమాలు కూడా ఉన్నాయి అందుకోసమే రవితేజ సినిమాకు గుడ్ బై చెప్పానని ఎందుకంటే రవితేజ శ్రీను వైట్ల సినిమా పూర్తిగా అమెరికాలో తీస్తున్న సినిమా కాబట్టి ఎక్కువ రోజులు అక్కడే ఉండాల్సి వస్తోంది కాబట్టి అంటూ అసలు కారణాన్ని చెప్పేసింది కాజల్ .