అల్లరోడి సినిమాలో చందమామ!


అల్లరోడి సినిమాలో చందమామ!
అల్లరోడి సినిమాలో చందమామ!

అల్లరి నరేష్ ప్రస్తుతం హీరోగా కెరీర్ లో  డౌన్ ఫాల్ చూస్తున్నాడు. హీరోగా తాను చేసిన రీసెంట్ సినిమాలు అన్నీ బోల్తా కొట్టాయి. కామెడీ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లరి నరేష్, కామెడీ సినిమాలు చేస్తుంటే జనాలు తిప్పి కొడుతున్నారు. దాంతో గత కొన్నేళ్లుగా తన రూట్ మార్చాడు. సూపర్ స్టార్  మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంలో అతని స్నేహితుడిగా కీలక పాత్ర పోషించాడు నరేష్. ఇప్పుడు కేవలం కామెడీ కథలే కాక సీరియస్ సినిమాల పై కూడా దృష్టి సారించాడు.

ప్రస్తుతం బంగారు బుల్లోడు అనే సినిమాను పూర్తి చేసిన అల్లరి నరేష్, రీసెంట్ గా నాంది అనే సినిమాలో నటించడం మొదలుపెట్టాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. తలక్రిందులుగా వేలాడుతూ రక్తమోడుతూ ఉన్న అల్లరి నరేష్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం అల్లరి నరేష్ మరో సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

సురేష్ బాబు నిర్మాతగా కొరియన్ చిత్రం డ్యాన్సింగ్ క్వీన్ రీమేక్ ను చేయతలపెట్టారు. ఇందులో అల్లరి నరేష్ హీరోగా కాగా హీరోయిన్ గా పేరున్న వ్యక్తిని తీసుకోవాలనుకున్నారు. అందుకే కాజల్ అగర్వాల్ ను సంప్రదిస్తే ఆమె ఎస్ చెప్పినట్లు తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ కూడా ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా లేదు. ఇప్పటికే సీనియర్ అయిన కాజల్ టాప్ సినిమాలు కాకుండా మీడియం బడ్జెట్ సినిమాలకు సైతం ఎస్ అంటోంది.

ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక్క భారీ చిత్రం ఇండియన్ 2. ప్రస్తుతం ఆ చిత్ర షూటింగ్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇటీవలే జరిగిన ప్రమాదం వల్ల ముగ్గురు సెట్స్ లోనే చనిపోయిన విషయం తెల్సిందే. కాజల్ కూడా సెట్స్ లోనే ఉండగా కొన్ని సెకెన్ల ముందే క్రేన్ నుండి ముందుకు వచ్చానని, అదృష్టం బాగుండి బయటపడ్డానని పేర్కొంది.

మరి అల్లరి నరేష్ కాజాల అగర్వాల్ కాంబో ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.