మేకప్ లేకుండా వచ్చి భయపెట్టిన కాజల్


కాజల్ అగర్వాల్ తాజాగా మేకప్ లేకుండా వచ్చి భయపెట్టింది . మేకప్ వేసుకోకుండా దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసి షాక్ ఇచ్చింది కాజల్ . అయితే ఈ ఫోటోకు ఓ క్యాప్షన్ కూడా పెట్టింది . మేకప్ వేసుకోకుండా ఇలా దర్శనం ఇస్తేనే నిజమైన సౌందర్యం అని హితబోధ చేస్తోంది . నిజమే కాజల్ అగర్వాల్ చెప్పింది అక్షరాలా నిజం కాకపోతే హీరోయిన్ లను కానీ అందమైన అమ్మాయిలను కానీ మేకప్ లేకుండా చూస్తే తట్టుకోగలమా ?

మేకప్ తో చూసి చూసి ఒక్కసారిగా మేకప్ లేకుండా కనిపిస్తే దడుసుకోవడం ఖాయం . కాజల్ అగర్వాల్ ఫోటోలు చూస్తే అలాగే ఉంది పరిస్థితి . ఈ భామ ఇటీవలే సీత అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది , అయితే ఆ సినిమా ఘోర పరాజయం పొందింది . సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ కాజల్ అగర్వాల్ తన క్యారెక్టర్ ని బాగా పోషించింది అన్న పేరు మాత్రం వచ్చింది .