కమల్ హసన్ పక్కన చందమామనట


kajal agarwal to romance with kamal hassan

లోకనాయకుడు కమల్ హసన్ సౌత్ దర్శక దిగ్గజం శంకర్ ల కాంబినేషన్ లో “భారతీయుడు” చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. తెలుగు తమిళ హిందీ బాషలలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. దీంతో దర్శకుడు శంకర్ మరోసారి కమల్ హసన్ తో ఈ చిత్రానికి సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రంలో కమల్ హసన్ కు జోడిగా చందమామ కాజల్ అగర్వాల్ ను చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసిందట.ఇటీవలే తెలుగులో సీనియర్ హీరో చిరంజీవి తో నటించిన కాజల్, లోకనాయకుడు కమల్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం రావడంతో వెంటనే ఒకే చెప్పినట్లు సమాచారం.

English Title: kajal agarwal to romance with kamal hassan