అఫీషియ‌ల్‌:  నాగార్జున‌కు జోడీగా కాజ‌ల్ ఫిక్స్‌!

Kajal agarwal to romance with Nagarjuna
Kajal agarwal to romance with Nagarjuna

టాలీవుడ్ చంద‌మామ ఇటీవ‌లే త‌న‌కు న‌చ్చిన‌, త‌ను మెచ్చిన బాయ్ ఫ్రెండ్ గౌత‌మ్ కిచ్లూని ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. పెళ్లికి ముందు వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా వున్న కాజ‌ల్ పెళ్లి త‌రువాత కూడా అదే త‌ర‌హాలో బిజీ అవుతోంది. ప్ర‌స్తుతం మంచు విష్ణుతో `మోస‌గాళ్లు` చిత్రంలో న‌టిస్తున్న కాజ‌ల్ … మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న `ఆచార్య‌` చిత్రంలో హీరోయిన్ గా క‌నిపించ‌నున్న విష‌యం తెలి‌సిందే.

తాజాగా మ‌రో బిగ్ ఆఫ‌ర్‌ని ద‌క్కించుకుంది. `వైల్డ్ డాగ్‌` చిత్రంలో ఎన్ కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా న‌టించిన కింగ్ నాగార్జున ఈ మూవీ రిలీజ్ సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నారు. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రం చేయ‌బోతున్నారాయ‌న‌. `పీఎస్‌వీ గ‌రుడ‌వేగ‌` చిత్రంతో ప‌లువురు హీరోల దృష్టిని ఆక‌ర్షించిన ఆయ‌న తాజాగా కింగ్ నాగార్జున‌తో సినిమా చేయ‌బోతున్నారు.

అ చిత్రంలో నాగ్‌కు జోడీగా తొలిసారి కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించ‌బోతోంది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం అఫీషియ‌ల్‌గా గురువారం ప్ర‌క‌టించారు. యాక్ష‌న్ డ్రామాగా రూపొంద‌నున్న ఈ చిత్రంలోకి కాల‌జ్‌కి వెల్క‌మ్ చెబుతున్నామంటూ ప్ర‌క‌టించారు. ఇందులో కాజ‌ల్ పాత్ర‌కు ప్రాధాన్య‌త వుంటుంద‌ని తెలిసింది. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే మేక‌ర్స్ వెల్ల‌డించ‌నున్నారు.