2 కోట్లు ఇస్తే దేనికైనా రెడీ అంటోంది


kajal agarwal wants money only

2 కోట్లు ఇస్తే చాలు దేనికైనా రెడీ అంటోంది కాజల్ అగర్వాల్ . సినిమాల్లోకి వచ్చి పదకొండేళ్లు అవుతోంది అయినప్పటికీ ఈ భామ ఫుల్లుగా డిమాండ్ చేస్తోంది . నాకు రెండు కోట్ల తప్పకుండా నటిస్తాను అందులో హీరో ఎవరు ? బ్యానర్ ఏంటి ? దర్శకుడు ఎవరు ? తదితర విషయాలు పట్టించుకోనని అంటోంది కాజల్ అగర్వాల్ . తాజాగా ఈ భామ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది . బెల్లంకొండ కుర్ర హీరో , పెద్దగా సక్సెస్ లు లేవు ,భారీ బడ్జెట్ తో చిత్రాలను ఎంచుకుంటున్నాడు దారుణంగా దెబ్బతింటున్నాడు అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూనే ఉన్నాడు బెల్లంకొండ .

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నటించడానికి కాజల్ అగర్వాల్ 2 కోట్లు డిమాండ్ చేయగా 1. 75 కోట్లకు సెటిల్ చేసినట్లు తెలుస్తోంది . ఈ కుర్ర హీరో అనే కాదు ఎవరైనా సరే వాళ్ళ పక్కన నటిస్తాను కానీ రెమ్యూనరేషన్ దండిగా ఇస్తే ఓకే అని అంటోందట కాజల్ . కెరీర్ లో ఎలాగూ పదకొండేళ్ళ కాలం అయిపొయింది దాంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా సొమ్ము చేసుకుంటోంది కాజల్ అగర్వాల్ . ఇంకొద్ది రోజులైతే ఈ భామని హీరోయిన్ గా తీసుకోవడం కష్టం కాబట్టి వసూల్ రాణి అవుతోంది అన్నమాట !

English Title: kajal agarwal wants money only