మేడ‌మ్ టుస్సాడ్స్‌లో క్రేజీ భామ‌!


మేడ‌మ్ టుస్సాడ్స్‌లో క్రేజీ భామ‌!
మేడ‌మ్ టుస్సాడ్స్‌లో క్రేజీ భామ‌!

చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. `ల‌క్ష్మీ క‌ల్యాణం` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ ముద్దుగ‌మ్మ త‌న 12 ఏళ్ల ప్ర‌యాణంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఎన్నో మ‌ర‌పురాని విజయాల్ని సొంతం చేసుకుంది. క్రేజీ క‌థానాయిక‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్టార్‌డ‌మ్ ని సొంతం చేసుకున్న ఈ ముంబై చిన్న‌ది అన‌తి కాలంలోనే ద‌క్షిణాదిలో అగ్ర క‌థానాయిక‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

`సింగం`తో బాలీవుడ్ బాట ప‌ట్టినా ద‌క్షిణాదిలో కాజ‌ల్ జోరు ఏ మాత్రం త‌గ్గ‌లేదు. కోటికి పైనే డిమాండ్ చేస్తూ అడ్ర క‌థానాయకుల స‌ర‌స‌న ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకుంటోంది. కెరీర్ ప‌రంగా కొంత డ‌ల్ ఫేజ్‌ని ఎదుర్కొంటున్నా క‌థానాయిక‌గా మాత్రం అదే జోరుని కంటిన్యూ చేస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు తాజాగా అరుదైన గౌర‌వం ద‌క్కింది. తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రు స్టార్ హీరోల‌కు మాత్ర‌మే ద‌క్కిన ఆ గౌర‌వం తొలిసారి క‌థానాయిక‌ల కేట‌గిరీలో కాజ‌ల్‌ని వ‌రించ‌డంతో ఇది ఆమె 12 ఏళ్ల కెరీర్‌కు ద‌క్కిన గుర్తింపుగా చెబుతున్నారు. క‌థానాయిక‌ల కేట‌గిరీలో తొలిసారి ద‌క్షిణాది నుంచి కాజ‌ల్‌కు మేడ‌మ్ టుస్సాడ్స్‌లో స్థానం ద‌క్కింది. సింగ‌పూర్‌లోని మ్యూజియ‌మ్‌లో కాజ‌ల్ ప్ర‌తిమ‌ను ఆవిష్క‌రించ‌బోతున్నారు.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల కోసం ఇటీవ‌లే మేడ‌మ్ టుస్సాడ్స్‌కు చెందిన బృందం కాజ‌ల్‌ని క‌లిసింది. ఆ విష‌యాల్ని మంగ‌ళ‌వారం కాజ‌ల్ సోష‌ల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. `నా ప్ర‌తిరూపాన్నిఫిబ్ర‌వ‌రి 5న సింగ‌పూర్‌లోని మేడ‌మ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చూడ‌బోతున్నారు` అని కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా వెల్ల‌డించింది. కాజ‌ల్ ప్ర‌స్తుతం మోస‌గాళ్లు, ముంబై సాగా, ఇండియ‌న్‌2 చిత్రాల్లో న‌టిస్తోంది.

 

View this post on Instagram

 

Me and my other half will see you in Singapore on 05/02/2020 ! ???‍♀️ (how could I not say that?! ?)

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

Credit: Instagram