తేజ మ‌ళ్లీ కాజ‌ల్‌నే న‌మ్ముకుంటున్నాడు!


Kajal agarwan and Teja Team up once more
Kajal agarwan and Teja Team up once more

గ‌త కొంత కాలంగా తన ప‌ట్టుని కోల్పోయిన ద‌ర్శ‌కుడు తేజ `నేనే రాజు నేనే మంత్రి` చిత్రంతో మ‌ళ్లీ విజ‌యాల బాట ప‌ట్టారు. ఈ సినిమా త‌రువాత మ‌ళ్లీ `సీత‌` చిత్రంతో ఫ్లాప్‌ని ఎదుర్కొన్న తేజ కొంత విరామం తీసుకుని ఈ సారి వ‌రుస‌గా రెండు ప్రాజెక్ట్‌ల‌ని ప్ర‌క‌టించారు. వాటికి `అలిమేలు మంగ వేంక‌ట ర‌మ‌ణ‌`, రాక్ష‌స రాజు రావ‌ణాసురుడు టైటిల్స్‌ని కూడా ఫిక్స్ చేశాడు. ఇటీవ‌లే త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా రెండు ప్రాజెక్ట్‌ల వివ‌రాల్ని, టైటిల్స్ ని ప్ర‌క‌టించారు.

ఇందులో మొద‌టి చిత్ర‌మైన `అలిమేలు మంగ వేంక‌ట ర‌మ‌ణ‌` చిత్రాన్ని హీరో గోపీచంద్‌తో తెర‌కెక్కించ‌బోతున్నట్టు తెలిసింది. మ‌రో చిత్రం `రాక్ష‌స రాజు రావ‌ణాసురుడు` చిత్రాన్ని హీరో రానాతో చేయ‌బోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం రానా వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా వుండ‌టం వ‌ల‌న ముందుగా గోపీచంద్ హీరోగా `అలిమేలు మంగ వేంక‌ట ర‌మ‌ణ‌` చిత్రాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్నార‌ట‌.

ఇంక రానాతో చేయ‌బోతున్నరాక్ష‌స రాజు రావ‌ణాసురుడు మూవీ కాశ్మీర్ నేప‌థ్యంలో రూపొంద‌నుంద‌ని, ఆర్టిక‌ల్ 370 ప్ర‌ధానంగా ఈ సినిమా వుంటుంద‌ని తెలిసింది. ఇందులో రానాకు జోడీగా మ‌ళ్లీ కాజ‌ల్ అగ‌ర్వాల్‌నే తేజ న‌మ్ముకున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆమెతో తేజ చ‌ర్చ‌లు జ‌రిపాడ‌ని, పాత్ర తీరు న‌చ్చ‌డంతో కాజ‌ల్ ఓకే చెప్పిన‌ట్టు తెలిసింది. ఇందు కోసం కాజ‌ల్‌ భారీగానే పారితోషికం డిమాండ్ చేసిన‌ట్టు చెబుతున్నారు. 2 కోట్లు కాజ‌ల్ డిమాండ్ చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.