సీత చిత్రం వాయిదాపడింది

కాజల్ అగర్వాల్బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జంటగా నటించిన ” సీత ” చిత్రం వాయిదాపడింది . ఈనెల 25 న సీత చిత్రాన్ని విడుదల చేయాలనీ అయిదు నెలల ముందే అనుకున్నారు కానీ జెర్సీ , కాంచన చిత్రాలు విడుదలై మంచి టాక్ తెచ్చుకోవడంతో థియేటర్ ల సమస్య వచ్చింది దాంతో సీత చిత్రాన్ని వాయిదా వేయనున్నారు . తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించాడు .

ఏప్రిల్ 25 న సీత చిత్రాన్ని విడుదల చేయాలనీ ఎప్పటి నుండో ప్లాన్ చేసారు కానీ అదే రోజున అవెంజర్స్ – ఎండ్ గేమ్ కూడా భారీ స్థాయిలో విడుదల అవుతుండటంతో థియేటర్ ల సమస్య తలెత్తింది దాంతో మేలో విడుదల కానుంది సీత చిత్రం . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు కానీ ఇప్పటివరకు కమర్షియల్ హిట్ అన్నది లేకుండా పోయింది పాపం ! మరి ఈ సీత తోనైనా బెల్లంకొండ హిట్ కొడతాడా ? లేదా చూడాలి .