చంద‌మామ కాజ‌ల్ పెళ్లైపోయింది!

 Kajal Aggarwal And Gautam Kitchlu Got Married
Kajal Aggarwal And Gautam Kitchlu Got Married

అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ పెళ్లైపోయింది. గ‌త కొంత కాలంగా ఫ్యామిలీ ఫ్రెండ్‌, ఇంటీరియ‌ర్ బిజినెస్‌మెన్ గౌత‌మ్ కిచ్లూని ముంబైలో వివాహం చేసుకుంది. ఈ వివాహానికి అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. వేద మంత్రాల సాక్షిగా ఉత్త‌రాది సంప్ర‌దాయంలో కాజ‌ల్‌, గౌత‌మ్ జంట ఒక్కటైంది. బ‌ధు మిత్రుల స‌మ‌క్షంలో కాజ‌ల్ గౌత‌మ్‌తో క‌లిసి ఏడ‌డుగులు వేసింది.

ఉత్త‌రాది మ‌ర్వాడీ ఫ్యామిలీ కావ‌డంతో వారి సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి తంతుని నిర్వ‌హించారు. ముంబై తాజ్ హోట‌ల్‌లో కాజ‌ల్ , గౌత‌మ్ కిచ్లూల వివాహం జ‌రిగింది. రెడ్ క‌ల‌ర్ లెహెంగాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ పెళ్లికూతురుగా ముస్తాబై మెరిసింది. గౌత‌మ్ కిచ్లూ వైట్ షేర్వానీలో క‌నిపించాడు. అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే ఈ వేడుక‌లో పాల్గొన‌డంతో అందుకు త‌గ్గ‌ట్టుగానే ఏర్పాట్లు చేశారు.

హోట‌ల్ బాల్ రూమ్‌లో సామాజిక దూరం పాటిస్తూ ఏర్పాట్లు చేశారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నాయి. పెళ్లి త‌రువాత కాజ‌ల్ హ‌నీమూన్ ట్రిప్‌కి వెళ్ల‌కుండా త‌ను అంగీక‌రించిన చిత్రాల‌కు టైమ్‌ కేటాయించ‌బోతోంది. చిరుతో `ఆచార్య‌`, క‌మ‌ల్‌తో `భార‌తీయుడు 2`తో పాటు మంచు విష్ణుతో `మోస‌గాళ్లు` వంటి చిత్రాల్లో న‌టిస్తోంది.