కాజల్, గౌతమ్ కిచ్లు హనీమూన్ మాల్దీవుల్లో


కాజల్, గౌతమ్ కిచ్లు హనీమూన్ మాల్దీవుల్లో
కాజల్, గౌతమ్ కిచ్లు హనీమూన్ మాల్దీవుల్లో

చందమామ కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు అక్టోబర్ 30న వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. కరోనా కారణంగా అతి తక్కువ మంది రెలెటివ్స్ సమక్షంలో వారి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఎక్కువ మంది గెస్ట్ లను కరోనా ప్రభావం కారణంగా పెళ్లికి ఆహ్వానించలేదు. ఇండస్ట్రీకి చెందిన స్నేహితులు అసలే రాలేదు. ఇక పెళ్లైన దగ్గరనుండి కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తోంది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేస్తోంది.

పెళ్ళైన దగ్గరనుండి ఆమె వివిధ సందర్భాలకు తగినట్లు ఫోటోలను షేర్ చేస్తోంది. ఇటీవలే బ్యాగ్ లను సర్దేశాం అంటూ ఒక పోస్ట్ ను షేర్ చేసింది. దాంతో కొత్త జంట హనీ మూన్ కు వెళుతున్నారని కన్ఫర్మ్ అయింది.

అలాగే ఇప్పుడు కాజల్ అగర్వాల్ పెట్టిన పోస్ట్ ను బట్టి వారు మాల్దీవ్స్ లో ఉన్నారని తెలుస్తోంది. కరోనా కారణంగా ఎక్కువ దూరం వెళ్లకుండా మాల్దీవ్స్ లోనే తమ హనీమూన్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.