సీసీసీకి చంద‌మామ 2 ల‌క్ష‌ల విరాళం!సీసీసీకి చంద‌మామ 2 ల‌క్ష‌ల విరాళం!
సీసీసీకి చంద‌మామ 2 ల‌క్ష‌ల విరాళం!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా కీల‌క వ్య‌వ‌స్థ‌ల‌న్నీ లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. జ‌న జీవితం స్థంభించిపోయింది. ఎక్క‌డి వారు అక్క‌డే అన్న‌ట్టుగా ప‌రిస్థితి యారైంది. క‌రోనాని క‌ట్ట‌డి చేయాలంటే దేశ వ్యాప్తంగా దాని చైన్‌ని తెంప‌డే ఏకైక మార్గం అని భావించిన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్‌కు సిద్ధ‌ప‌డిన విష‌యం తెలిసిందే. ముందు 21 రోజుల పాటు లాక్ డౌన్‌ని వివిజ‌య‌వంతంగా పూర్తి చేయ‌డం, అయినా క‌రోనా క‌ట్ట‌డి కాక‌పోవ‌డంతో మే 3 వ‌ర‌కు లాక్‌డౌన్‌ని తాజాగా ప్ర‌ధాని మోదీ పొడిగించిన విష‌యం తెలిసిందే.

దీంతో జ‌న‌జీవితం మ‌ళ్లీ స్థింభించి పోయింది. నిత్యం జ‌రిగే కార్య‌క‌లాపాల‌న్నీ ఆగిపోయాయి. అన్ని రంగాల‌తో పాటు సినిమా రంగం కూడా స్వ‌చ్ ఆఫ్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. దీంతో డైలీ లేబ‌ర్స్ ప‌రిస్థితి మ‌రీ దుర్భ‌రంగా మారింది. దీంతో వారిని ఆదుకునే క్ర‌మంలో సీసీసీ ని స్థాపించారు. దీనికి చిరంజీవి నుంచి చిన్న స్థార్‌ల వ‌ర‌కు భారీ స్థాయిలో విరాళాలు ప్ర‌క‌టించారు. అయితే దీనికి హీరోయిన్‌ల నుంచి ఎలాంటి స్పంద‌న లేదు.

లావ‌ణ్య త్రిపాఠి త‌ప్ప మ‌రో హీరోయిన్ విరాళం అందించ‌లేదు. తాజాగా ఆ జాబితాలో చంద్ర‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ చేరింది. సీసీసీకి ఆమె 2 ల‌క్ష‌ల విరాళాన్ని తాజాగా ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని ఆమె మేనేజ‌ర్ గిరిధ‌ర్ గురువారం మీడియాకు వెల్ల‌డించారు. ఆర్జీజిఎస్ ద్వారా ఫండ్‌ని అకౌంట్‌కి ట్రాన్స్‌ఫ‌ర్ చేశామ‌ని వెల్ల‌డించారు.