`మోస‌గాళ్లు` నుంచి కాజ‌ల్ లుక్ వ‌చ్చేసింది!


`మోస‌గాళ్లు` నుంచి కాజ‌ల్ లుక్ వ‌చ్చేసింది!
`మోస‌గాళ్లు` నుంచి కాజ‌ల్ లుక్ వ‌చ్చేసింది!

వ‌రుస ఫ్లాపుల్లో వున్న మంచు విష్ణు కొంత విరామం త‌రువాత బౌన్స్ బ్యాక్ కావాల‌న్న ఆలోచ‌న‌తో చేస్తున్న ఇండో అమెరిక‌న్ హాలీవుడ్ చిత్రం `మోస‌గాళ్లు`. వ‌ర‌ల్డ్‌లో జ‌రిగిన మోస్ట్ బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జెఫ్రీ జీ ఛిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ బ్యాన‌ర్‌పై మంచు విష్ణు న‌టిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.

ఇటీవ‌ల హీరో మంచు విష్ణు పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్‌ని రిలీజ్ చేశారు. ఇందులో మంచు విష్ణు అర్జున్ అనే పాత్ర‌లో న‌టిస్తున్నాడు. త‌ను మంచి వాడా? లేక చెడ్డ‌వాడా? అన్న‌ది ప్రేక్ష‌కుల ఊహ‌కే వ‌దిలేస్తున్నాన‌ని, అది మీరే ఊహించుకోవాల‌ని మంచు విష్ణు వెల్ల‌డించాడు. ఇందులో కాజ‌ల్ అగర్వాల్ కూడా న‌టిస్తోంది. అయితే విష్ణు ప‌క్క‌న హీరోయిన్‌గా కాద‌ని, చెల్లెలి పాత్ర‌లో క‌నిపిస్తుంద‌న వార్త‌లు వినిపిస్తున్నాయి.

దీనిపై ఇంత వ‌ర‌కు క్లారిటీ రాలేదు. తాజాగా త‌న‌ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని కాజ‌ల్ అగ‌ర్వాల్ శుక్ర‌వారం సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసింది. ఇందులో కాజ‌ల్ పాత్ర పేరు అను. `హ‌ల్లో గుడ్ బ్యాబ్ అనేది జీవితంలో ఎదుర‌య్యే సంద‌ర్భాన్ని బ‌ట్టి వుంటుంది` అని కాజ‌ల్ ట్వీట్ చేసింది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కాబోతోంది.