కాజల్ గ్లామర్ షో మాములుగా ఉండదట


కాజల్ గ్లామర్ షో మాములుగా ఉండదట
కాజల్ గ్లామర్ షో మాములుగా ఉండదట

చందమామ కాజల్ అగర్వాల్ దశాబ్దానికి పైగా హీరోయిన్ గా కొనసాగుతోంది. ఎప్పటినుండో టాప్ నటిగా కాజల్ ప్రస్థానం ప్రత్యేకం. ఎప్పటికప్పుడు తనదైన సినిమాలను ఎంపిక చేసుకుంటూ వచ్చిన కాజల్ గ్లామర్ గా కనిపించింది కానీ ఎప్పుడూ తాను గీసుకున్న గిరి నుండి బయటకు వచ్చింది లేదు. గ్లామర్ కూడా ఒక స్థాయి వరకే పరిమితం చేసింది. ఇప్పటిదాకా తన కెరీర్ లో సింగిల్ పీస్, బికినీ ధరించింది లేదు. అయితే త్వరలోనే ఆ గీతను చెరిపేయనుంది.

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం నటిస్తోన్న ఇండియన్ 2 చిత్రం సెట్స్ పై ఉన్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో కాజల్ గ్లామర్ షో ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా శంకర్ కొన్ని సీన్స్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దాని ప్రకారంగా కాజల్ బికినీ ధరించనున్నట్లు సమాచారం. ముందు కాజల్ ఈ విషయంపై నో అనుకున్నా కానీ శంకర్ ఆ సీన్ యొక్క ప్రాముఖ్యత తెలపడంతో కాజల్ కూడా చివరికి ఎస్ చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం కాకుండా కాజల్ అగర్వాల్ చిరంజీవితో ఆచార్య చిత్రంలో నటిస్తోంది. అలాగే మంచు విష్ణు హీరోగా మోసగాళ్లు పూర్తి చేసింది.