చరణ్ ని చంపేసి.. ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటా: కాజల్


Prabhas and Kajal
Prabhas and Kajal

స్టార్స్ జీవితాల గురించి గుట్టు విప్పుతూ అందరికి షాక్ ఇస్తున్న మంచు లక్ష్మి బోల్డ్ షో  ఫీట్ అప్ విత్ ది స్టార్స్ మరోసారి ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. బోల్డ్ ఆన్సర్స్ తో ప్రతి ఒక్కరు షో కంటెంట్ కి తగ్గట్టుగానే రెచ్చిపోతున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ – శృతి హాసన్ – నిఖిల్ వంటి వారు ఈ టాక్ లో షోలో హంగామా చేయగా ఇప్పుడు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఆ డోస్ మరింత పెంచేసింది.

తారక్ తో లేచిపోతా అంటూ.. ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పింది. ఇక మగధీరుడైన రామ్ చరణ్ ని చంపేస్తానని షాకింగ్ కామెంట్ చేసింది. రీసెంట్ గా జరిగిన ఈ ఎపిసోడ్ వూట్ వెబ్ ఛానెల్ లో ప్రసారం కానుంది. ప్రభాస్ – జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్.. వంటి స్టార్ హీరోల నేమ్స్ ఇచ్చిన మంచు లక్ష్మి వారిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావ్? ఎవరితో జంప్ అవుతావు? ఇక చంపెదవీర్ని అని ప్రశ్నలు వదిలింది.
ఇక సరదాగా కాజల్ అగర్వాల్ ఏ మాత్రం ఆలోచించకుండా పెళ్లి కాలేదు కాబట్టి మిస్టర్ పర్ఫెక్ట్  ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇక టెంపర్ లాంటి తారక్ తో లేచిపోతానని చెబుతూ.. రామ్ చరణ్ ని మాత్రం కిల్ చేస్తానని వివరణ ఇచ్చింది దీంతో ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. అలాగే డిఫరెంట్ షేడ్స్ లో కొన్ని రొమాంటిక్ సీన్స్ పై కూడా బేబీ కామెంట్ చేయడం విశేషం. ఇక ప్రస్తుతం కాజల్ భారతీయుడు 2 సినిమాతో పాటు బాలీవుడ్ లో ముంబై సాగా అనే సినిమా చేస్తోంది.