తల్లిగా మారనున్న కాజల్ అగర్వాల్?

తల్లిగా మారనున్న కాజల్ అగర్వాల్?
తల్లిగా మారనున్న కాజల్ అగర్వాల్?

పెళ్ళైన తర్వాత కాజల్ అగర్వాల్ కెరీర్ మరింత ఊపందుకుంది. పెళ్ళికి ముందు ఎక్కువగా గ్లామరస్ రోల్స్ కే స్టిక్ అయిన కాజల్ ఇప్పుడు తన సినిమాల ఎంపికలో ప్రయోగాలు చేస్తోంది. ఆచార్యలో చిరంజీవి సరసన నటిస్తోన్న కాజల్, బాలీవుడ్ లో ఉమా అనే చిత్రం చేస్తోంది. దీంతో పాటు రెండు తమిళ ప్రాజెక్ట్స్ ను సైన్ చేసినట్లు సమాచారం.

అందులో ఒక చిత్రంలో కాజల్ అగర్వాల్ తల్లిగా నటిస్తుందిట. ప్రముఖ నిర్మాత రమేష్ పి పిళ్ళై ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రాజు శరవణన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ తల్లిగా కనిపిస్తుందిట. తల్లి-కూతురు బాండింగ్ ప్రధానంగా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. చిన్న పిల్లకు తల్లి పాత్రలో కాజల్ ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తుందో చూడాలి.

అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాజల్ అగర్వాల్ గతేడాది తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును వివాహమాడిన సంగతి తెల్సిందే.