ఇంత‌కీ చంద‌మామ రిసెప్ష‌న్ ఎక్క‌డ‌? 


ఇంత‌కీ చంద‌మామ రిసెప్ష‌న్ ఎక్క‌డ‌? 
ఇంత‌కీ చంద‌మామ రిసెప్ష‌న్ ఎక్క‌డ‌?

అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో మంచి గుర్తింపుతో పాటు ద‌క్షిణాది ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర‌ని వేసుకుంది. అక్టోబ‌ర్ 30న త‌న‌కు న‌చ్చిన త‌ను మెచ్చిన బాయ్ ఫ్రెండ్ గౌత‌మ్ కిచ్లూని ప్రేమించి పెళ్లిచేసుకున్న విష‌యం తెలిసిందే. ముంబైలోని హోట‌ల్ తాజ్‌లో వీరి వివాహం వైభ‌వంగా జ‌రిగింది.లైట్ రెడ్ క‌ల‌ర్ లెహెంగాలో పెళ్లి కూతురిగా కాజ‌ల్ హొయ‌లు పోయింది.

ప్ర‌స్తుతం ఈ కొత్త జంట మాల్దీవ్స్‌లో హ‌నీమూన్ ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తోంది. మాల్దీవ్స్‌లో భ‌ర్త గౌత‌మ్ కిచ్లూతో క‌లిసి కాజ‌ల్ సంద‌డి చేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. పెళ్లైన త‌రువాత కూడా కాజ‌ల్ డ్రెస్‌ల విష‌యంలో ఎలాంటి మొహ‌మాటాన్ని ప్ర‌ద‌ర్శించ‌కుండా అందాల విందు చేస్తోంది.

ఇదిలా వుంటే కాజ‌ల్ ద‌క్షిణాదిపై త‌న‌కున్న ప్రేమ‌కు గుర్తుగా ఇక్క‌డ రిసెప్ష‌న్‌ని ఏర్పాటు చేయాల‌నుకుంటొంద‌ట‌. తెలుగు సినిమాల్లో ఎదిగిన కాజ‌ల్ త‌మిళ సినిమాల్లో నూ మెరిసి స్టార్ డ‌మ్‌ని ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. అందుకే హైద‌రాబాద్‌లో, చెన్నైలో వేరు వేరుగా రిసెప్ష‌న్‌ని ప్లాన్ చేస్తోంద‌ట‌. దీనికి సంబంధించిన ఏర్పాట్ల‌ని హ‌నీమూన్ త‌రువాత ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిసింది.