అటు తిరిగి ఇటు తిరిగి కాజల్ వద్దకే చేరిన తేజ


అటు తిరిగి ఇటు తిరిగి కాజల్ వద్దకే చేరిన తేజ
అటు తిరిగి ఇటు తిరిగి కాజల్ వద్దకే చేరిన తేజ

సీత ప్లాప్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న దర్శకుడు తేజ ఇప్పుడు రెండు స్క్రిప్ట్ లను సిద్ధం చేసుకున్నాడు. లాక్ డౌన్ కు ముందే తన రెండు ప్రాజెక్ట్ లను అనౌన్స్ చేసాడు తేజ. అందులో మొదటిది గోపీచంద్ హీరోగా అలివేలు మంగ వెంకట రమణ అనే రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా. ఈ చిత్రాన్ని ఆగష్టులో లాంచ్ చేసి సెప్టెంబర్ నుండి షూటింగ్ ను మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకున్నాడు తేజ. అయితే ఈ సినిమా హీరోయిన్ విషయంలో తేజకు చుక్కెదురైంది.

ముందుగా కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా అనుకున్నాడు కానీ అప్పుడే సీత చిత్రంలో కాజల్ తో పనిచేయడంతో వేరే ఆప్షన్స్ ను కూడా చూసుకున్నాడు. కీర్తి సురేష్, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ వంటి వారిని ట్రై చేసాడు కానీ ఈ కథకు ఎవరూ సెట్ అవ్వలేదు, లేదా డేట్స్ సమస్య వచ్చింది.

ఈ నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ కే తేజ ఓటు వేసినట్లు తెలుస్తోంది. గోపీచంద్, కాజల్ పెయిర్ ఫ్రెష్ ఫీల్ ఉంటుందని తేజ భావిస్తున్నాడు. ఈ చిత్రం కాకుండా రానా హీరోగా రాక్షసరాజు రావణాసురుడు అనే ప్రాజెక్ట్ ను కూడా పట్టాలెక్కించనున్నాడు.