ఇండియన్ 2 దారుణ సంఘటనపై స్పందించిన కాజల్

ఇండియన్ 2 దారుణ సంఘటనపై స్పందించిన కాజల్
ఇండియన్ 2 దారుణ సంఘటనపై స్పందించిన కాజల్

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ జంటగా సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇండియన్ 2. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా నిన్న రాత్రి సెట్స్ లో దురదృష్టకర సంఘటన జరిగిన విషయం తెల్సిందే. ఈ దుర్ఘటనలో కృష్ణ (అసిస్టెంట్ డైరెక్టర్), చంద్రన్ (ఆర్ట్ డైరెక్టర్), మధు (ప్రొడక్షన్ అసిస్టెంట్), భారీ క్రేన్ మీదపడడంతో అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెల్సిందే. ఈ దారుణ సంఘటన ఇండియన్ 2 సెట్స్ లో, టీంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎవరూ ఇంకా ఆ సంఘటన నుండి తేరుకోలేకపోతున్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.

అలాగే హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఈ సంఘటనపై స్పందించింది. “గత రాత్రి జరిగిన దారుణ సంఘటన నుండి బయటకు రాలేకున్నాను. నా తోటి వారిని కోల్పోవడం చాలా విచారకరం. నా హృదయ వేదనను మాటల్లో చెప్పలేకపోతున్నాను. కృష్ణ, మధు, చంద్రన్ కుటుంబాలకు నా ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలకు దేవుడు బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆ భయంకరమైన క్రేన్ ఆక్సిడెంట్ ఒక షాక్ లాగే ఉంది. ఒక్క సెకన్ గ్యాప్ లో నేను బయటపడ్డాను. ఇప్పుడిలా ట్వీట్ చేయగలుగుతున్నాను. సమయం మరియు జీవితం యొక్క విలువ బాగా తెలిసొచ్చింది” అని ట్వీట్ చేసింది.

కమల్ హాసన్, కాజల్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్, పది సెకెన్ల ముందు వరకూ ఆ క్రేన్ కిందే ఉండి అప్పుడే ముందుకు కదిలారుట. సరిగ్గా వాళ్ళు ఇలా కదలడం, క్రేన్ కుప్పకూలిపోవడం దాని కింద్ అసిస్టెంట్లు ముగ్గురూ పడి చనిపోవడం జరిగింది. ముందు ఈ దుర్ఘటన గురించి తెలిసి విచారం వ్యక్తం చేసిన వాళ్ళు, కమల్, కాజల్ తృటిలో తప్పించుకోవడం గురించి తెలుసుకుని షాక్ కు గురవుతున్నారు. ఏదేమైనా అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఈ సంఘటన తీవ్ర కలకలాన్ని రేపింది.

Credit: Twitter