`క‌లిసుందాంరా` బ‌డ్జెట్ అంతేనా?


Kalisundam Raa Movie Budjet
Kalisundam Raa Movie Budjet

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా గ‌త కొన్నేళ్ల క్రితం వ‌చ్చిన చిత్రం `క‌లిసుందాంరా`. త‌మిళ ద‌ర్శ‌కుడు ఉద‌య‌శంక‌ర్ రూపొందించిన ఈ చిత్రాన్నిసురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డి.సురేష్‌బాబు నిర్మించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం అప్ప‌టి వ‌ర‌కు వెంక‌టేష్ న‌టించిన చిత్రాల‌కు మించి వ‌సూళ్ల‌ని సాధించి ఆల్ టైమ్ ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్ప‌ట్లోనే 190 రోజులు ఆడిన ఈ చిత్రం వ‌సూళ్ల ప‌రంగా హీరో వెంక‌టేష్ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌న‌రి సాధించిన చిత్రంగా నిలిచి స‌రికొత్త రికార్డును నెల‌కొల్పింది. ద‌ర్శ‌కుడు క‌ళాత‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్ ఇందులో వెంక‌టేష్‌కు తాత‌య్య‌గా న‌టించారు. సిమ్రన్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రం 2000 సంవ‌త్స‌రంలో సంక్రాంతికి రిలీజై విజేత‌గా నిలిచింది.

ఇన్ని ప్ర‌త్యేక‌త‌లున్న ఈ చిత్రాన్ని అప్ప‌ట్లో కేవ‌లం 3 కోట్ల 15 ల‌క్ష‌ల 16 రూపాయ‌ల బ‌డ్జెట్‌తో నిర్మించామ‌ని సురేష్‌బాబు సోమ‌వారం మీడియాతో వెల్ల‌డించ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ప‌క్కా ప్లాన్‌తో, ఇన్ని రోజుల్లోనే నిర్మించాల‌నే డెడ్ లైన్‌తో `క‌లిసుందాంరా` చిత్రాన్ని నిర్మించామ‌ని, ఆ ప్లానింగ్ ఇప్ప‌టి నిర్మాత‌ల్లో క‌నిపించ‌డం లేద‌ని సురేష్‌బాబు నేటి నిర్మాత‌ల‌కు చుర‌క‌లు అంటించే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌స్తుత సిస్ట‌మ్ బాగాలేద‌ని, ఈ ప‌ద్ద‌తి మారితేనే బ‌డ్జెట్ కంట్రోల్ అవుతుంద‌ని సురేష్‌బాబు చెప్పుకొచ్చారు. సిస్ట‌మ్ బాగుంటే ప్ర‌తీ ఒక్క‌రూ బాగుంటార‌ని, ఐటీ కంపెనీల్లో ప్రాజెస్ క‌రెక్ట్‌గా వుంది కాబ‌ట్టే అవి స‌జావుగా ర‌న్న‌వుతున్నాయ‌ని, అదే ప‌ద్ద‌తిని ఇక్క‌డ కూడా అవ‌లంబించాల‌ని, అప్పుడే ఇండ‌స్ట్రీ బాగుప‌డుతుంద‌ని సురేష్‌బాబు స్ఫ‌స్టం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే ఇన్ని చెబుతున్న ఆయ‌న థియేట‌ర్ల విష‌యంలోనూ మారితే చిన్న నిర్మాత‌ల‌కు మంచి రోజులొస్తాయ‌ని కొంత మంది నిర్మాత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.